TSRTC agitation : ఆర్టీసీపై ప్రభుత్వ ఎక్స్‌పరిమెంట్ ఫెయిల్ అయిందా...? కార్మికుల ఆందోళన బాట ఎందుకు..?

ఆర్టీసీ కార్మికుల ఆందోళణ

TSRTC agitation : ఆర్టీసీని గాడిలో పెడతామన్న ప్రభుత్వ హామిలు నీరుగారిపోయాయా..? ఆర్టీసి ఆస్తులు అమ్మి సంస్థను కాపాడాలనే ప్రభుత్వ ఉద్దేశ్యానికి కార్మికులు ఏమంటున్నారు..ఇన్నాళ్లు ప్రభుత్వం చేసిన ఎక్స్‌పరిమెంట్ వర్కౌట్ కాలేదా.. అందుకే మరోసారి కార్మికులు ఆందోళన బాట పడుతున్నారా...?

  • Share this:
    ఆర్టీసీ ఆస్తులు , ఉద్యోగుల పరిరక్షణకు ఆర్టీసీ యూనియన్ ఆందోళన బాట పట్టేందుకు సిద్దమైంది. గత రెండు సంవత్సరాలుగా ఆర్టీసిలో యూనియన్ల పేరిట ఎలాంటీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించకుండా సంయమనం పాటించిన ఉద్యోగులు తాజాగా తమ ఆస్తులు, ఉద్యోగాల పరిరక్షణ కోసం నడుం బిగించారు. దీంతో ఆదివారం నుండి ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. ఇందుకోసం ఆర్టీలోని పది యూనియన్లు ఏకతాటిపైకి వచ్చాయి.

    ఈ నేపథ్యంలోనే ఆదివారం అన్ని డిపోల్లో కరపత్రాల ద్వారా తమ ఆందోళనకు మద్దతు ఇచ్చేందుకు కరపత్రాల ద్వారా ప్రచారం చేయనున్నారు. సోమవారం కార్మిక శాఖ కమీషనర్‌కు వినతిపత్రం ఇవ్వడంతో పాటు అన్ని కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు. సమావేశంలో భవిష్యత్ కార్యచరణ చర్చించడంతో పాటు గత కొన్నాళ్లుగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించిన అనంతరం చివరగా ఆర్టీసి భవన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. ఇక చివరగా ఆయా డిపో పరిధిలోని ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు.

    గత రెండు సంవత్సరాల క్రితం చేపట్టిన ఆర్టీసి సమ్మె ఆర్టిసి కార్మికుల్లో ఎలాంటీ ఆందోళనలకు లేకుండా చేయాలని నిర్ణియింది. ప్రభుత్వ సహాకారంతో ఆర్టీసి అభివృద్ది బాట పట్టించేందుకు సీఎం కేసిఆర్ సలహాలతో ముందుకు పోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే కార్గో సర్విసులు మినహా ఎలాంటీ ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు కరోనా పరిస్థితుల ప్రభావం కూడా ఆర్టీసిపై పడింది. ఆదాయం లేకుండా కనీసం జీతాలు సమయానికి ఇవ్వలేని స్థితిలోకి నెట్టివేయబడింది.

    దీంతో ప్రభుత్వమే 1000 కోట్ల రుణానికి అనుమతి ఇచ్చినా..సంస్థ పనితీరు దృష్ట్యా ఏ బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రభుత్వం ఆర్టీసి ఆస్తులను అమ్మెందుకు సిద్దమైనట్టు సమాచారం దీంతో కార్మికులు ఆందోళన బాట పట్టేందుకు కారణంగా తెలుస్తోంది.అయితే రెండు సంవత్సరాలుగా ఎలాంటీ ఆందోళన లేని ఆర్టీసి , తాజా పరిణామాలతో ఎలాంటీ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. ఆందోళనలు, నిరసనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ వర్గాలు కూడా కార్మికుల చర్యలపై ఎలా స్పందిస్తారనేది ముఖ్యంగా మారింది.
    Published by:yveerash yveerash
    First published: