హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS Sharmila: తగ్గేదేలే అన్న వైఎస్ షర్మిల.. చెప్పుతో అంటూ హాట్ కామెంట్స్

YS Sharmila: తగ్గేదేలే అన్న వైఎస్ షర్మిల.. చెప్పుతో అంటూ హాట్ కామెంట్స్

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

Telangana: నిన్న పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షర్మిలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. షర్మిల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నిన్న పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షర్మిలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. షర్మిల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదంటూ షర్మిల పరోక్షంగా టీఆర్ఎస్ నేతలకు స్పష్టం చేశారు. రాజన్న బిడ్డ ఇలాంటి వాటికి భయపడదని కామెంట్ చేశారు. అంతేకాదు మరోసారి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే చెప్పుతో సమాధానం చెబుతానని ఘాటుగా అన్నారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి నిజంగానే రైతులపై ప్రేమ ఉంటే.. తాను చేపట్టబోయే పాలమూరు నీళ్లపోరులో కూర్చోవాలని అన్నారు.

  ఇదిలా ఉంటే వైఎస్‌ షర్మిలపై(YS Sharmila) అసెంబ్లీ స్పీకర్‌కు టీఆర్ఎస్(TRS) ఎమ్మెల్యేలు నిన్న ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్, లక్ష్మారెడ్డి, కాలే యాదయ్య స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందించారు. ప్రజాప్రతినిధులు అనే విషయాన్ని మరిచి ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేవిధంగా షర్మిల అవమానిస్తుందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

  ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధుల హక్కులకు, గౌరవానికి భంగం కలిగించినందుకు, నిరాధార ఆరోపణలు, జుగుప్సాకర ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు. షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరారు. షర్మిలపై ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి(Pocharam Srinivasa Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు ప్రివిలేజ్ కమిటీకి అంశాన్ని సిఫారసు చేస్తానని వారికి హామీ ఇచ్చారు. మరోవైపు దీనిపై సభాహక్కుల ఉల్లంఘన కమిటీ సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం.

  TRS Vs YS Sharmila: తెలంగాణలో కీలక పరిణామం.. టీఆర్ఎస్ వర్సెస్ షర్మిల.. ఏం జరగనుంది ?

  YS Sharmila: మంత్రి మరదలు అని మాట్లాడొచ్చా? గమ్మునుండాల్నా?: వైఎస్​ షర్మిల

  ఇదిలా ఉంటే ఈ జరుగుతున్న పరిణామాలను వైఎస్ఆర్‌టీపీ కూడా నిశితంగా గమనిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి ఏ కౌంటర్ ఇవ్వాలనే దానిపై వ్యూహరచన చేస్తోంది. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తనపై స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనపై చర్యలకు ఆలోచించే ముందు పరాయి ఆడదాన్ని, ఒక తల్లిని మరదలంటూ తనతో పాటు తన తోటి మహిళలను కించపరిచిన సంస్కార హీనుడైన మంత్రి నిరంజన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో నిరుద్యోగుల కోసం తాను చేసిన దీక్షలను వ్రతాలంటూ కామెంట్ చేసిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Telangana, Trs, YS Sharmila

  ఉత్తమ కథలు