హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS Sharmila: మంత్రి మరదలు అని మాట్లాడొచ్చా? గమ్మునుండాల్నా?:  వైఎస్​ షర్మిల

YS Sharmila: మంత్రి మరదలు అని మాట్లాడొచ్చా? గమ్మునుండాల్నా?:  వైఎస్​ షర్మిల

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వైఎస్ షర్మిలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంగళవారం పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై వైఎస్ షర్మిల స్పందించారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  తెలంగాణ మంత్రులు (Telangana Ministers), ఎమ్మెల్యేలపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై (YSRTP president YS Sharmila) చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంగళవారం పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై వైఎస్ షర్మిల స్పందించారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనపై చర్యలు తీసుకొంటే న్యాయపరంగా ముందుకు వెళ్తానని  వైఎస్ షర్మిల చెప్పారు. బుధవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర శిబిరం వద్ద ఆమె ఎన్టీవీతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.

  తెలంగాణ మంత్రులపై తాను చేసిన విమర్శలపై ఆమె స్పందిస్తూ..  ప్రజలు అన్నీ గమనిస్తున్నారని షర్మిల అన్నారు.  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి ఏమాట్లాడారో.. నేను ఏం మాట్లాడానో ప్రజలు చూస్తున్నారని షర్మిలా తెలిపారు. ప్రజలు చర్చించుకుంటున్న అంశాలతో పాటు జర్నలిస్టుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా తాను పాదయాత్ర సందర్భంగా విమర్శలు చేసినట్టుగా షర్మిల వివరించారు.

  పరాయి స్త్రీని అలా అనొచ్చా..?

  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Agriculture Minister Niranjan Reddy) పరాయి స్త్రీ గురించి మరదలు (Sister in Law) అంటూ మాట్లాడాల్నా అని షర్మిలా ప్రశ్నించారు. ఆయన వెనకాలా వెళ్లాలా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను చూసీ చూడనట్టుగా గమ్మునుండాల్నా? అని ప్రశ్నించారు. ఇంకొకరైతే చెప్పు తీసుకొని కొట్టేవారని షర్మిలా మండిపడ్డారు.తనకు ఆత్మగౌరవం ఉండదా అని ఆమె ప్రశ్నించారు. తాను ప్రజల మధ్య ఉండాలనుకొంటున్నట్టుగా చెప్పారు. తన పాదయాత్రను నిలిపివేస్తే మరో రూపంలో ప్రజల వద్దకు వెళ్తానన్నారు షర్మిలా.

  రంగారెడ్డి, మహబూబ్ నగర్ (Mahbunagar)జిల్లాల్లో తన పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులపై తాను చేసిన విమర్శల్లో అవాస్తవాలు లేవన్నారు షర్మిలా.  ప్రజలు చర్చించుకుంటున్నఅంశాలకు ఆధారాలు అయితే ఉండవన్నారు. ప్రజల ఒపీనియన్స్​ ముఖ్యం అని ఆమె అన్నారు. ఆధారాలు (Proofs) సేకరించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో (Telangana) చోటు చేసుకున్న విషయాలపై మాట్లాడేందుకు ప్రజలు భయపడుతున్నారన్నాని షర్మిలా వ్యాఖ్యానించారు. ప్రజలే కాదు జర్నలిస్టులు కూడా ఈ విషయమై మాట్లాడేందుకు జంకుతున్నారని ఆమె చెప్పారు.

  Shocking News: విధి ఆడిన వింత నాటకం.. యువతికి మృత్యువును చూపించిన తేలు.. 

  తెలంగాణలో ఉద్యోగాలు (Jobs) తీయించి వేస్తారని, కేసులు పెడతారనే భయం ప్రజల్లో  ఉందన్నారు షర్మిలా. ఎనిమిదేళ్లుగా అవినీతి కూరుకుపోయిందని షర్మిల ఆరోపించారు. అధికార పార్టీ చేస్తున్న అవినీతి గురించి బీజేపీ , కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు. అధికార పార్టీ అవినీతిని ప్రశ్నించేసరికి కోపం వస్తుందా అని TRS నేతలను షర్మిలా ప్రశ్నించారు. నిజాలు మాట్లాడడం తప్పా అని ఆమె అడిగారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడం సరైందేనా అని ఆమె ప్రశ్నించారు.  కాంగ్రెస్​, బీజేపీ నాయకులను కొన్నట్లు తననే కొనలేరని ఆమె అన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Mahbubnagar, Telangana Politics, YS Sharmila, Ysrtp

  ఉత్తమ కథలు