హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS Sharmila: షర్మిల ప్లాన్ సగం మాత్రమే సక్సెస్.. మిగతా సగం వర్కవుట్ కావడం లేదా ?

YS Sharmila: షర్మిల ప్లాన్ సగం మాత్రమే సక్సెస్.. మిగతా సగం వర్కవుట్ కావడం లేదా ?

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila: కొద్దిరోజుల పాటు ఎవరూ పట్టించుకోని షర్మిల పాదయాత్రకు ఇతర పార్టీల నేతల కౌంటర్లు, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో మంచి ప్రచారం లభించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఏపీని వదిలి తెలంగాణలో రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్న షర్మిల.. అందుకోసం సుదీర్ఘమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్‌టీపీ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాజకీయాల్లో రాణించేందుకు కష్టపడుతున్న షర్మిల(YS Sharmila).. కొద్దిరోజులుగా దూకుడుగా ఇతర పార్టీల నేతలపై రాజకీయ దాడి చేస్తున్నారు. అప్పట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులను టార్గెట్ చేసిన షర్మిల.. తాజాగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఇందుకు జగ్గారెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆ తరువాత షర్మిల జగ్గారెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. అయితే కొద్దిరోజుల పాటు ఎవరూ పట్టించుకోని షర్మిల పాదయాత్రకు (Padayatra) ఇతర పార్టీల నేతల కౌంటర్లు, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో మంచి ప్రచారం లభించింది.

  రాజకీయంగా కూడా ఇది షర్మిలకు చాలావరకు కలిసొచ్చిందనే చర్చ జరుగుతోంది. అయితే షర్మిల కౌంటర్లకు తెలంగాణలోని ఇతర పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు స్పందించడం వల్ల ఆమె లక్ష్యం సగమే నెరవేరిందనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలో(Telangana) రాజకీయంగా బలపడేందుకు సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్న షర్మిల.. ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆకర్షించలేకపోతున్నారు. ఆమె పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం లేకపోవడం వల్లే ఇతర పార్టీల నేతలెవరూ ఇటు వైపు చూడటం లేదనే వాదన ఉంది. వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినప్పటికీ.. ఇప్పటికీ ఆ పార్టీలో పెద్దగా చేరికలు లేవు.

  చెప్పుకోదగ్గ నేతలు, పేరున్న నాయకులు ఎవరూ ఆ పార్టీలో చేరడం లేదన్నది ఎవరూ కాదనలేని విషయం. అయితే తమ పార్టీలో కార్యకర్తలనే నాయకులుగా తయారు చేస్తామని షర్మిల తరుచూ చెబుతున్నారు. చేరికలు లేవని తాము ఎప్పుడూ బాధపడటం లేదని అంటున్నారు. అయితే రాజకీయంగా బలపడేందుకు ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రొత్సహించాలని బీజేపీ వంటి బలమైన పార్టీలే తమదైన వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణలో చేరికలను పెద్ద ఎత్తున ప్రొత్సహించడం ద్వారా రాజకీయంగా బలపడాలని ఆ పార్టీ భావిస్తోంది.

  KCR National Party: దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న కేసీఆర్ .. ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా ఆ సమయానికి..

  KCR | Singareni : సింగరేణి ఉద్యోగులకు కేసీఆర్‌ దసరా కానుక .. సంస్థ లాభాల్లోంచి 30శాతం వాటా ఇవ్వాలని ఆదేశం

  ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కారణంగా తమ పార్టీ బలపడుతుందనే వాదన జనంలోకి వెళుతుందన్నది ఆ పార్టీ నాయకుల ప్లాన్. అయితే షర్మిల పార్టీ విషయంలో మాత్రం అది జరగడం లేదు. ఆమె చేస్తున్న విమర్శలకు ఇతర పార్టీల నేతలు స్పందిస్తున్నా.. ఇతర పార్టీల నుంచి ఆమె పార్టీలోకి వలసలు లేకపోవడం మాత్రం ఆమె పార్టీకి పెద్ద మైనస్సే అనే చర్చ జరుగుతోంది. దీంతో తెలంగాణలో ఆమె రాజకీయ వ్యూహం సగం మాత్రమే సక్సెస్ అవుతుందని కొందరు చర్చించుకుంటున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Telangana, YS Sharmila

  ఉత్తమ కథలు