హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS Sharmila: ఢిల్లీకి వైఎస్ షర్మిల.. కేంద్ర పెద్దలను కలిసే ఛాన్స్.. కేసీఆర్ సర్కార్‌పై ఫిర్యాదు ?

YS Sharmila: ఢిల్లీకి వైఎస్ షర్మిల.. కేంద్ర పెద్దలను కలిసే ఛాన్స్.. కేసీఆర్ సర్కార్‌పై ఫిర్యాదు ?

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila: పాదయాత్ర ఆపి మరి షర్మిల డిల్లీకి వెళ్లడంపై ఆసక్తి నెలకొంది. కొంతకాలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందంటూ షర్మిల ఆరోపణలు చేస్తున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణలో పాదయాత్ర చేపడుతున్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 6న డిల్లీకి వెళ్తున్న షర్మిల... 7న కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. అయితే పాదయాత్ర ఆపి మరి షర్మిల డిల్లీకి వెళ్లడంపై ఆసక్తి నెలకొంది. కొంతకాలంగా కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందంటూ షర్మిల ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై గవర్నర్ తమిళసైకి ఫిర్యాదు చేసిన షర్మిల.. ఢిల్లీలో ఈ అంశంపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దసరా సందర్భంగా మూడు రోజుల పాటు పాదయాత్రకు విరామం ఇచ్చిన షర్మిల(YS Sharmila).. తిరిగి ఈ నెల 8న కామారెడ్డి(Kamareddy) నుంచి తన పాదయాత్రను కొనసాగించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

  మరోవైపు తెలంగాణ పాదయాత్రలో అధికార పార్టీపై షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. స్థానిక నేతలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంగ‌ళ‌వారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ప‌ర్య‌టిస్తున్న ష‌ర్మిల‌... అక్క‌డి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న క్రాంతి కిర‌ణ్ తీరును ప్ర‌శ్నిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్యే అవినీతిని ప్ర‌శ్నించిన త‌న‌పై క్రాంతి కిర‌ణ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారంటూ షర్మిల మండిప‌డ్డారు.

  ఈ కేసుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని ఆమె తేల్చి చెప్పారు. కేసీఆర్ దళిత సీఎం అని మోసం చేసినప్పుడు.. దళిత మహిళ మరియమ్మను లాక్ అప్ డెత్ చేసినప్పుడు.. దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు.. దళితులకు మూడెకరాల భూమి అని మోసం చేసినప్పుడు.. ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి పట్టించినప్పుడు.. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయనప్పుడు.. దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని.. దళిత బంధు అని మోసం చేసినప్పుడు.. కేసులు పెట్టే ధైర్యం క్రాంతి కిరణ్‌కు ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు.

  KCR-Andhra Pradesh: ఏపీపై కేసీఆర్ ఫోకస్.. అదే జరిగితే.. టీడీపీ , వైసీపీలు అలా కౌంటర్ ఇస్తాయా ?

  KCR-Munugodu: మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ కీలక నిర్ణయం..

  అప్పుడు కేసులు పెట్టడం చేతకాని మీరు.. ఇప్పుడు నాపై కేసులు పెడితే శుంఠ కాక మరేంటి? అని నిల‌దీశారు. మీ అవినీతిపై ప్రశ్నించే దమ్ము నాకుంది. కాదని నిరూపించే దమ్ము నీకుందా? అని కూడా ష‌ర్మిల ఆయ‌న‌కు స‌వాల్ విసిరారు. జర్నలిస్ట్ లను పిలుద్దాం, ప్రతిపక్షాలను పిలుద్దాం, జోగిపేట నడిగడ్డ మీదే చర్చ పెడదామంటూ ష‌ర్మిల పేర్కొన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Telangana, YS Sharmila

  ఉత్తమ కథలు