Home /News /telangana /

TS POLITICS YSRTP PRESIDENT SHARMILA SAWAL HAS DEMANDED THE RESIGNATION OF KCR CM ON PUBLIC ISSUES IN THE STATE

Telangana : ప్రజాసమస్యలపై సీఎం కేసీఆర్‌కు సవాల్..ఓడిపోతే ముక్కు నేల రాస్తానన్న షర్మిల

(కేసీఆర్‌కి షర్మిల సవాల్)

(కేసీఆర్‌కి షర్మిల సవాల్)

Sharmila:రాష్ట్రంలోని ప్రజలు సమస్యలు లేవని చెబితే తాను ముక్కు నేలకు రాస్తానని..సమస్యలు ఉంటే కేసీఆర్‌ సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. రాష్ట్రంలో అందర్ని మోసం చేస్తూ కేసీఆర్‌ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ప్రజాప్రస్థానం పాదయాత్ర సభలో విమర్శించారు.

ఇంకా చదవండి ...
వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (YSRTP )అధ్యక్షురాలు ప్రజాప్రస్థానం పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్‌(TRS) పాలకులు గద్దెనెక్కిన తర్వాత రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం వైన్స్, బెల్ట్ షాపులు పెట్టిన మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడవాళ్ల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించలేని దౌర్భాగ్యస్థితిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్‌ షర్మిల(YS Sharmila). రాజన్న బిడ్డగా ఆయన ఆశయాలను నిలబెట్టేందుకు ..తెలంగాణ ప్రజల పక్షాన చివరక్షణం వరకు పోరాడుతానని భరోసా ఇచ్చారు.

పాదయాత్రలో షర్మిల ఫైర్..
బంగారు తెలంగాణ సాధన పేరుతో రాష్ట్ర భవిష్యత్తు మార్చేస్తానంటూ వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజాసప్రస్థానం పాదయాత్ర 86వ రోజు ఖమ్మం జిల్లా వైర నియోజకవర్గంలో కొనసాగింది. ఉదయం 9గంటలకు కొణిజర్ల మండలంలోని పెద్దరామాపురం క్యాంప్ నుంచి పాదయాత్ర చేపట్టారు షర్మిల. మండలంలోని లక్ష్మీపురం, మంగాపురం,రత్నాపురం, తీగల బంజర, లాలపురం, పల్లిపాడు గ్రామాల మీదుగా షర్మిల పాదయాత్రను కొనసాగించారు. సాయంత్రం 5 గంటలకు వైరా టౌన్‌లో బహిరంగ సభ నిర్వహించారు షర్మిల.పథకాలన్ని ఎత్తేశారు..
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో వైఎస్ఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలేవి ఇప్పుడున్న టీఆర్ఎస్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శల అస్త్రం ఎక్కుపెట్టారు షర్మిల. వైరా టౌన్‌లో బహిరంగ వేదిక ద్వారా సీఎం కేసీఆర్‌ని విమర్శిస్తూనే తన తండ్రి పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు షర్మిల. రుణమాఫీ ఒకేకాలంలో అమలు చేసిన చేసిన ఘనత వైఎస్ఆర్‌దేన్నారామె. పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకునేందుకు ఫీజ్ రియంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన గొప్ప నేత రాజన్న అని ఆమె కొనియాడారు. అందుకే తెలంగాణ ప్రజల దృష్టిలో మహానేతకు మరణం లేదని కోట్లాది మంది ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్‌ బ్రతికే ఉన్నారని చెప్పుకొచ్చారు.

ఇది చదవండి : ఊరి పేరే ఆయన ఇంటి పేరైంది.. గ్రామం కోసం శ్రీమంతుడిగా మారాడు


రాజన్న పాలన తెస్తా..
తన తండ్రి పాలన ఓ స్వర్ణయుగంగా పేర్కొన్న షర్మిల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ లో చేయని మోసం లేదని, కేసీఆర్‌ సీఎం కావడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదనన్నారు. అన్నీ వర్గాల ప్రజలను మోసం చేసారని కేసీఆర్‌పై మండిపడ్డారు షర్మిల. కేసీఆర్‌ని ఓ తాలిబాన్‌తో పోల్చుతూ ఘాటు విమర్శలు చేశారు షర్మిల. వైరాలో ఇండిపెండెంట్‌గా నిలబడిన వ్యక్తిని వైఎస్ఆర్‌ అభిమానుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేని చేస్తే అతడ్ని ఓ పశువులా కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారామె.

ఇది చదవండి : లక్షలు ఖర్చయ్యే సర్జరీలు అక్కడ ఫ్రీ .. వేరే ప్రభుత్వ ఆసుపత్రులకు ఆ దవఖానా ఆదర్శం


ప్రజల కష్టాలకు కేసీఆరే కారకుడు..
రాష్ట్రంలో నిరుద్యోగ యువత కూలీలు పనులు చేసుకుంటుంటే కనిపించడం లేదా అని కేసీఆర్‌ని ప్రశ్నించారు షర్మిల. పోడుభూముల దగ్గర నుంచి బెల్టు షాపుల వరకు అంతా టీఆర్‌ఎస్‌లే దోచుకుంటున్నారని ఘాటు విమర్శలు చేశారు షర్మిల. అమ్మాయిలపై వరుస అత్యాచారాలు జరుగుతుంటే రాష్ట్రంలో మహిళలకు భద్ర కల్పించలేని ముఖ్యమంత్రి ఉరివేసుకొని చనిపోవాలంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల వస్తున్నాయంటే ప్రజల్ని తన గారడి మాటలతో మాయ చేస్తారని విమర్శించారు షర్మిల.

ఇది చదవండి : వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించినా రామప్ప టెంపుల్‌లో అభివృద్ధి ఏది..?


కేసీఆర్‌కు షర్మిల సవాల్ ..
చివరగా పాదయాత్ర బహిరంగసభ ద్వారా కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. తనతో ఒక్కరోజు పాదయాత్ర చేయాలని...ఆపాదయాత్రలో ప్రజలు సమస్యలు లేవని చెబితే తాను ముక్కు నేలకు రాసి వెళ్లిపోతానని..ఒకవేళ సమస్యలు ఉంటే కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేసి దళితుడ్ని ముఖ్యమంత్రిని చేయాలని సవాల్ చేశారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము కేసీఆర్‌కి ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైపల్యాలను ఎండగట్టడంతో బీజేపీ, కాంగ్రెస్‌ ఫెయిల్‌ అయ్యాయనని అందుకే తాను పార్టీ పెట్టానని చెప్పారు షర్మిల. పులి కడుపున పులే పుడుతుందని పులి బిడ్డను ఆశీర్వదించమని వైరా సభ సాక్షిగా తెలంగాణ ప్రజల్ని కోరారు వైఎస్‌ షర్మిల. తండ్రి పేరు నిలబెడతానని..ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని పాదయాత్ర సాక్షిగా మాటిచ్చారు షర్మిల. వైఎస్ఆర్‌టీపీ నాయకురాలు షర్మిల పాదయాత్రలోపార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. బహిరంగసభ వేదికపై చెప్పిన మాటల్ని పెద్ద సంఖ్యలో జనం ఆలకించారు.
Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Telangana Politics, TRS leaders, YS Sharmila

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు