Ys Sharmila: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగ సమస్యలపై కలిసి పోరాడుదామని వారిని షర్మిల కోరినట్లు తెలుస్తుంది. ఉమ్మడి కార్యచరణ చేపడదామని..ప్రగతిభవన్ మార్చ్ కూడా పిలుపునిద్దామని వారికి షర్మిల సూచించినట్లు సమాచారం. అయితే దీనికి త్వరలో సమావేశం అవుదామని బండి సంజయ్ చెప్పగా..పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది. కాగా రాష్ట్రంలో టిఎస్పిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. ఈ క్రమంలో అందరం ఒక్కటై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజలకు తెలియజేయాలనే భావనలో షర్మిల ఉన్నట్లు అర్ధమవుతుంది.
కాగా రేవంత్, బండి సంజయ్ లకు స్వయంగా ఫోన్ చేసిన షర్మిల కలిసి పోరాడుదాం అనే అంశాన్ని లేవనెత్తడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే షర్మిల రిక్వెస్ట్ కు బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. మరోవైపు రేవంత్ రెడ్డి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.
తీగ లాగితే డొంక కదిలిన చందాన టిఎస్పిఎస్సి పేపర్ లీక్ వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. మొదట ఈ కేసు దర్యాప్తును బేగంబజార్ పోలీసులు మొదలుపెటగా..ఆ తర్వాత సిట్ (Special Investigation Team) చేతుల్లోకి వెళ్ళింది. సిట్ విచారణలో ఇప్పటికే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనేక మందిని అరెస్ట్ చేసిన పోలీసులు కొంతమందిని తమ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక తాజాగా కేసు దర్యాప్తులో భాగంగా కీలక విషయం ఒకటి తేలినట్లు సమాచారం.
ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, రేణుక అలాగే ఆమె భర్తతో సహా 15 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో రమేష్, షమీమ్, సురేష్ లను 3 రోజులుగా సిట్ విచారిస్తుంది. ఈ విచారణలో అనేక విషయాలపై సిట్ అధికారులు ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగా ఆ ముగ్గురిలో రమేష్ అనే వ్యక్తి TSPSCలో పని చేసే ఓ బోర్డు సభ్యుని పీఏగా తెలుస్తుంది. అయితే ఇతనికి పేపర్ లీక్ అంశానికి..ఆర్ధిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. మరి ఈ పరిణామాల నేపథ్యంలో సిట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Mp revanthreddy, Telangana, YS Sharmila