మాది పార్టీనే కాదంటున్న మీరు దాడులు ఎందుకు చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Ys Sharmila) నిప్పులు చెరిగారు. మేము పాదయాత్ర చేస్తుంటే అడ్డుకోడానికి అనేక కేసులు పెడుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Rajashekar Reddy) ఎన్నో అద్భుత పథకాలు తీసుకొచ్చారు. అందుకే ఆయనంటే అంతగా తెలంగాణ ప్రజలకు అంత ఇష్టం. రాజశేఖర్ రెడ్డి (Rajashekar Reddy) మరణం తట్టుకోలేక 700 మంది ప్రాణాలు తీసుకున్నారు. అలాంటి గొప్ప నాయకుడు చేసిన అభివృద్ధితో ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు.
కేసీఆర్ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని, ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదని కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ పార్టీకి షర్మిల గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి (Rajashekar Reddy) ఫ్లెక్సీలు చించిన, విగ్రహాల జోలికొచ్చిన ఊరుకునేది లేదని మండిపడ్డారు. రాజశేఖర్ (Rajashekar Reddy) బిడ్డ మీ తాటాకు చెప్పుళ్ళకు భయపడేది లేదు. మీ బెదిరింపులకు అస్సలు భయపడం. నిరుద్యోగుల కోసం మేము పోరాటం చేసినప్పుడు నా చేయి విరగొట్టిన, బట్టలు చించి ఘోరంగా అవమానించినప్పుడే వెనకడుగు వేయకుండా..బెదరకుండా ముందుకు వెళ్తున్నాం. మీరు చెప్పులు వేసిన, బాంబులు వేసిన, రాళ్లు వేసిన ఏదైనా చేసుకోండి. రాజశేఖర్ బిడ్డ వెనకడుగు వేసేది లేదు. నేను దేనికి లొంగని దాన్ని. రాజశేఖర్ (Rajashekar Reddy) బిడ్డ తెలంగాణ ప్రజల కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిందని ఆమె చెప్పుకొచ్చారు. రాజశేఖర్ (Rajashekar Reddy) రెడ్డి సంక్షేమ పాలన తీసుకొచ్చే వరకు ఆగేది లేదని..ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తామని షర్మిల (Ys Sharmila) అన్నారు.
ఏ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ , బీజేపీ మాట్లాడుతుందా అని ప్రశ్నించారు. మరి ప్రజల పక్షాన మాట్లాదేవరని వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రశ్నిస్తుందని అన్నారు. టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై సమాధానం చెప్పలేక దాడులు చేస్తున్నారని షర్మిల (Ys Sharmila) ఆరోపించారు. మీకు సమాధానం చెప్పే దమ్ము ఉంటే ప్రజల సమక్షంలో చెప్పొచ్చు, కానీ మీరు సమాధానం చెప్పకపోగా మాపై దాడులు ఎందుకు చేయాలన్నారు. సిగ్గు లేకుండా పని చేయకుండా ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారు. మీరు చేతకాని దద్దమ్మలు కాబట్టే ఇలా దాడులు చేస్తున్నారని షర్మిల (Ys Sharmila) మండిపడ్డారు. ధర్మపురి నియోజకవర్గం చామనపల్లి వద్ద ప్రెస్ మీట్ లో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana News, Trs, TRS leaders, YS Sharmila