తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో (Telangana government schools) చదివే పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కేసీఆర్ (KCR) సర్కార్ కనీస వసతులు కల్పించడంలేదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ధ్వజమెత్తారు. చివరకు మంచి నీళ్లు (Drinking water) కూడా ఇవ్వడం లేదంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా వుందో అర్థంచేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో మంచి నీళ్ళు దొరకడం లేదు.. కానీ మద్యం (Alcohol) ఏరులై పారుతోందన్నారు. గుడులు బడుల కన్నా వైన్స్ షాపులు, బెల్ట్ షాపులే తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేసారు. బంగారు తెలంగాణ అని చెప్పి చివరకు బార్లు, బీర్ల తెలంగాణగా మార్చారని సీఎం కేసీఆర్ పై షర్మిల సెటైర్లు విసిరారు.
గుడులు, బడులు కన్నా వైన్స్ షాపులు ఎక్కువ..
షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నడిగుడెం మండలంలోని సిరిపురం గ్రామంలో పాదయాత్ర చేపట్టిన షర్మిల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... మరుగు దొడ్ల క్లీనింగ్ కోసం ఉపాద్యాయులు చందాలు వేసుకునే పరిస్థితి తెలంగాణ పాఠశాలల్లో వుందన్నారు. భవనాలు కూలిపోయే పరిస్థితిలో వున్నాయని...అయినా పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు. అసలు ప్రభుత్వ పాఠశాలలు అంటేనే కేసీఆర్ కు లెక్క లేదని షర్మిల అన్నారు. ‘‘మంచినీళ్లు కూడా లేవని ప్రజలు చెప్తున్నారు. మంచి నీళ్ళు లేవు కానీ... మద్యం మాత్రం ఏరులై పారుతుంది. గుడులు బడులు కన్నా వైన్స్ షాపులు ఎక్కువ. మద్యం అమ్మకాల్లో తెలంగాణ అభివృద్ధి జరిగింది. మద్యం అమ్మకాలు నాలుగు ఇంతలు పెరిగాయి
మహిళల పై అత్యాచారాలు నాలుగు రెట్లు పెరిగాయి. ప్రభుత్వ వాహనాల్లో టీఆరెఎస్ నేతల బిడ్డలు అత్యాచారాలు చేస్తున్నారు. అల్లుడు వస్తె ఎక్కడ పడుకోవాలని డబుల్ బెడ్ రూం ఇస్తానని చెప్పారు. ఇప్పుడు అల్లుడు వస్తె ఎక్కడ పడుకుంటున్నారు. అల్లుడు వస్తె ఈ సారి డబుల్ బెడ్ రూం ఇవ్వందుకు కేసీఆర్ ఇంటికి పంపించండి
ఆర్టీసీ చార్జీలు డబుల్..
20 రూపాయలు అయ్యే చార్జీలను 40 రూపాయలు చేసినట్లు ప్రయాణికులు చెప్పారు. పోనీ ఆర్టీసీ బాగుపడిందా అంటే అది కూడా లేదు. రోడ్లు బాగోలేవు అని బస్సులు కూడా రద్దు చేశారట . కార్మికులు కూడా గగ్గోలు పెడుతున్నారు .యునియన్లను రద్దు చేసి వెట్టి చాకిరీ కార్మికులతో చేయిస్తున్నారు
5 వేలు ఇచ్చి..
సబ్సిడీ పథకాలు అన్ని బంద్ పెట్టారు. 5 వేలు ఇస్తే రైతులు కోటీశ్వరులు అవుతారా. 5 వేలు ఇస్తే రైతులు కార్లలో తిరుగుతారా... వరి వేసుకుంటే ఉరి అని చెప్పే దరిద్రపు ముఖ్యమంత్రి మనకే ఉన్నారు. ఈ దరిద్రం మనకే తగులుకుంది. రైతులకు 60 ఏళ్ల లోపే చనిపోవాలని నుదుటిన మరణ శాసనం రాశాడు. రైతు భీమా రావాలి అంటే 59 ఏళ్లకే చనిపోవాలట. రైతు చనిపోతే భీమా ఇవ్వని దిక్కుమాలిన పాలన కేసీఆర్ పాలన కౌలు రైతు తెలంగాణ లో రైతు కాదట.. కౌలు రైతు రైతు కాదని చెప్పే దిక్కుమాలిన ముఖ్యమంత్రి మనకే ఉన్నాడు నిరుపేద రైతు కౌలు రైతు..కౌలు రైతుకు ఆసరా ఎక్కువ ఇవ్వాలి
రుణమాఫీ లేదు..
వడ్డీలకు వడ్డీలు రైతుల మీద పడుతుంది. బ్యాంక్ ల దగ్గర రైతులు డీ ఫాల్టర్లు గా మిగిలిపోయారు. వ్యవసాయాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారు.. గ్రామాలను సర్వనాశనం చేశారు. నిరుద్యోగులను సర్వనాశనం చేశారు. కేసీఆర్ కుటుంభం లో 5 ఉద్యోగాలు ఉన్నాయి.డిగ్రీలు, పిజిలు చదివిన వాళ్ళు కూలి పనులకు పోతున్నారు. దిక్కుమాలిన కేసీఆర్ పాలన లో నోటిఫికేషన్ల లేవు. కనీసం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు పరామర్శ లేదు.
దొంగ చేతిని తాళాలు ఇచ్చినట్లు...16 వేల కోట్లు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పులు చేశారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ల పేరు చెప్పి కమీషన్లు కాజేశారు. ఒక మంత్రి వింత సమాధానం చెప్తున్నారు... వాడి పడేసిన బీర్ బాటిల్ అమ్ముకోమని.. 8 ఏళ్ల పరిపాలన లో కేసీఆర్ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు.
బంగారు తెలంగాణ అని చెప్పి బార్ల తెలంగాణ ...బీర్లు తెలంగాణ గా మార్చారు. ప్రజలకు కాలేదు బంగారు తెలంగాణ .. కేసీఆర్ బిడ్డలకు అయింది బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ లో మీ బ్రతుకులు బజారున పడ్డాయి. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి .. మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ఈ సారి ఆకాశం లో చందమామ తెస్తా అంటాడు. మనకు ఈ సారి బుద్ది రావాలి.. ” అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alcohol, CM KCR, Drinking water, Suryapet, Telangana Politics, Telangana schools, YS Sharmila