తెలంగాణ(Telangana)లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో జనం అగచాట్లు పడుతుంటే టీఆర్ఎస్(TRS) ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్టీవీ(YSRTP) విమర్శించింది. ప్రజల గోడు ఆలకించి నష్ట నివారణపై దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి(Chief Minister) ముందస్తు ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయారంటూ ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలYS Sharmila ట్వీట్టర్ Twitterవేదికగా ఘాటు విమర్శలు చేశారు. అంతే కాదు వరద ప్రవాహంలో మునిగిపోయిన కాళేశ్వరం పంప్‌హౌస్ (Kaleswaram Pump House)మరమ్మతుల పేరుతో మరో లక్ష కోట్లు అప్పు చేయడానికైనా సిద్ధంగానే ఉన్నారంటూ తీవ్రఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల.
ప్రజల గోడు పట్టదా సీఎం సార్..
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం, ప్రజలు పడుతున్న అవస్థలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పాలకులను ఆమె ఎండగట్టారు. వరదల్లో రాష్ట్రం విలవిలలాడుతుంటే ప్రజలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి ఎక్కడున్నారు అంటూ ప్రశ్నించారు. కనీసం వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అయినా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. వరదలు, వర్షాలతో జలదిగ్భందంలో చిక్కుకొని బాధపడుతున్న ప్రజలకు గుండె ధైర్యం ఇవ్వాల్సింది పోయి గూగుల్ మ్యాప్ చూస్తూ గప్పాలు కొట్టుడా నీ పాలన అంటూ ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
మునిగిన కాళేశ్వరం పంపుహౌజ్ లు..
మరో లక్ష కోట్లు అప్పుచేసైనా సరే మునిగిన పంప్ హౌజ్ ను పైకి లేపబోతున్న దొరగారు..
మళ్ళీ ప్రాజెక్టు మనకే అంటున్న మెగా క్రిష్ణారెడ్డి
అప్పుల కోసం పరిగెత్తబోతున్న అధికారులు..
సంచులు సవరించుకుటున్న కల్వకుంట్ల కుటుంబం..
పాలాభిషేకాలకు భజన బ్యాచ్ రెడీ.. pic.twitter.com/VoQ54da8So
— YS Sharmila (@realyssharmila) July 15, 2022
గడి దాటి బయటకు వచ్చి చూడండి..
అంతే కాదు కేసీఆర్ దృష్టి అంతా ముందస్తు ఎన్నికలపైనే ఉందన్న షర్మిల...అందులో పావు వొంతైనా వరదల మీద పెట్టి ఉంటే కొంచమైనా నష్టం తగ్గేదని విమర్శించారు. గత వారం రోజులుగా జనాలు వరదల్లో చిక్కుకొని చస్తున్నారని.. సుమారు 15 లక్షల ఎకరాలకు పైగా పంటలు నష్టపోయి రైతన్న కన్నీరు పెడుతున్నారని , రహదారులు కొట్టుకపోయి రవాణా స్తంభిస్తే, వైద్యం అందించాల్సిన దవాఖానలు మునిగిపోతుంటే, ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. ఇప్పటికైనా గడి దాటి బయటకురా కేసీఆర్ వచ్చి బాధితులను ఆదుకోమంటూ ట్వీట్ చేశారు.
ముందస్తుపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదా ..
గోదావరి వరద ప్రవాహం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రభావం చూపింది. ప్రాజెక్టు పరిధిలోని సరస్వతి (అన్నారం), మేడిగడ్డ (లక్ష్మి) పంపుహౌస్‌లు పూర్తిగా నీట మునిగాయి. పంపుహౌస్‌లలోని పంపులు, మోటార్లు, ప్యానెల్ బోర్డు, విద్యుత్ పరికరాలు నీట మునిగాయి. వైఎస్ షర్మిల కాళేశ్వరం పంప్‌హౌస్ అంశంపై కూడా కేసీఆర్‌పై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. వరదలో మునిగిపోయిన కాళేశ్వరం పంపుహౌజ్ ప్రాజెక్టు పనులు తిరిగి మెగా క్రిష్టారెడ్డికే అప్పగిస్తారని విమర్శించారు. ఆ పనుల పేరుతో మరో లక్ష కోట్లు అప్పుచేసైనా సరే మునిగిన పంప్ హౌజ్‌ను పైకి లేపాలని చూస్తున్నారు దొరగారు అంటూ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. వరదల సహాయకచర్యలు, నిష్టనివారణపై వైఎస్ షర్మిల చేసిన ట్వీట్లపై అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana Politics, YS Sharmila