హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS Sharmila: కాంగ్రెస్‌పై వైఎస్ఆర్ ఉమ్మేసేవారు.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..

YS Sharmila: కాంగ్రెస్‌పై వైఎస్ఆర్ ఉమ్మేసేవారు.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలోనూ వైఎస్ఆర్‌ కీలకంగా వ్యవహరించారని షర్మిల అన్నారు. అలాంటి వైఎస్ఆర్ చనిపోతే ఆయన దోషి అని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారని విమర్శించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఒకవేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు జీవించి ఉంటే ఆయన కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసి ఉండేవారని మండిపడ్డారు వైఎస్ షర్మిల. ఉమ్మడి మెదక్ (Medak) జిల్లా పరిధిలోని నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్‌కు(YSR)  కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. 30 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్‌కి సేవ చేశారని.. 2004, 2009లో రెండు సార్లు అధికారంలోకి తెచ్చారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలోనూ వైఎస్ఆర్‌ కీలకంగా వ్యవహరించారని అన్నారు. అలాంటి వైఎస్ఆర్ చనిపోతే ఆయన దోషి అని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారని విమర్శించారు. ఇది వైఎస్ఆర్‌ను వెన్నుపోటు పొడిచినట్లు కాదా ? అని ప్రశ్నించారు.

  కనీసం హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే.. ఆయన ఎలా చనిపోయాడని కాంగ్రెస్ పార్టీ దర్యాప్తు కూడా చేయించలేదని ఆరోపించారు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడారని.. చనిపోయాక FIR నమోదు చేసి అవమానపరిచారని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మళ్లీ ఇప్పుడు వైఎస్ఆర్ ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతుందా ? అని నిలదీశారు. వైఎస్ఆర్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదని అన్నారు. కాంగ్రెస్‌కు వైఎస్ఆర్ ఖ్యాతిని తెచ్చారని.. వైఎస్ఆర్‌కు కాంగ్రెస్ ఖ్యాతిని తీసుకురాలేదని అన్నారు.

  వైఎస్ఆర్ చనిపోయాక కాంగ్రెస్ 5 ఏళ్లు అధికారంలో ఉందని.. అయినా ఆ పార్టీ పేదలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. వైఎస్ఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు ఆశీర్వదించారని.. కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేయలేదని అన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకాలు వైఎస్ఆర్ తీసుకొచ్చిన పథకాలు అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా ఇన్ని పథకాలు ఉన్నాయా ? అని ప్రశ్నించారు.

  KCR Yadadri: రేపు యాదాద్రికి కేసీఆర్ .. ఆయన వెంట నలుగురు దాతలు

  Mulugu: ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారుల దాడులు.. అసలు నిజం తెలిసి షాకైన అధికారులు

  ఎవడైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇన్ని పథకాలు ప్రవేశ పెట్టారా..? అని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో ప్రజలు పడిన కష్టాలు కళ్లారా చూసిన వైఎస్ఆర్.. ఈ పథకాలన్నీ తీసుకొచ్చారని షర్మిల చెప్పారు. పేద బిడ్డలు పెద్ద చదువులు చదవకపోతే వారి బ్రతుకులు బాగుపడవు అని ఆయన అనుకున్నారని.. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పుట్టిందని అన్నారు. ప్రజల అవసరాలు తెలుసుకుని వైఎస్ఆర్ పథకాలు తీసుకొచ్చారని అన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Telangana, YS Sharmila

  ఉత్తమ కథలు