తెలంగాణ(Telangana)లో అధికార టీఆర్ఎస్ నేతలపై వైఎస్ఆర్టీపీ(Ysrtp) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila)తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వనపర్తి (Wanaparthy)జిల్లాలో పాదయాత్ర చేపడుతున్న షర్మిల తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy)చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాని వాళ్లంతా హమాలీ పని చేసుకోవాలని మంత్రి గతంలో చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఒక మంత్రి పదవిలో ఉంటూ రైతులు, నిరుద్యోగులను ఇంత చులకన చేసి మాట్లాడం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీశారు. మీరు పదవులు అనుభవించాలి..మీ పిల్లలు డిగ్రీలు చదివి మహరాజుల్లా బ్రతకాలి పేదలు మాత్రం హమాలీలుగానే ఉండిపోవాలా అంటూ మండిపడ్డారు.
మంత్రి కౌంటర్ ..
కేసీఆర్ ప్రభుత్వంపై ఆపార్టీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మంత్రి నిరంజన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మదనాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రకు వచ్చిన వైఎస్ షర్మిలకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ముందుగా పాదయాత్రలో మదనాపూర్ గ్రామంలో మొక్క జొన్న కంకులు కాల్చి జీవనోపాధి పొందే మహిళలతో ముచ్చటించారు షర్మిల. అటుపై తాను కూడా మొక్కజొన్న కంకులను కాల్చారు. వారికి జీవనోపాధి, కంకులు కాల్చుకొని జీవిస్తున్న మహిళ కష్ట, సుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాల్చిన మొక్కజొన్న కంకులను రుచి చూశారు రాజన్న బిడ్డ.
మంత్రిగా ఆ మాట మాట్లాడొచ్చా..
పాదయాత్రలో భాగంగా మంత్రి నిరంజన్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యోగాలు రాని వాళ్లంతా హమాలీ పని చేసుకోవాలని మంత్రి గతంలో చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఒక మంత్రి పదవిలో ఉంటూ రైతులు, నిరుద్యోగులను ఇంత చులకన చేసి మాట్లాడం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీశారు. మీరు పదవులు అనుభవించాలి..మీ పిల్లలు డిగ్రీలు చదివి మహరాజుల్లా బ్రతకాలి పేదలు మాత్రం హమాలీలుగానే ఉండిపోవాలా అంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అసమర్ధ పాలన అందిస్తోందని విమర్శిస్తూనే ప్రజల్లో అధికార పార్టీని తీవ్రంగా ఎండగట్టారు షర్మిల.
మీరు హమాలి పని చేసుకోండి..
హమాలి పని పని కాదా...ఆ పని చేసుకోండి అని మంత్రి అనడంపై కౌంటర్ ఇచ్చారు షర్మిల. డిగ్రీలు, పీజిలు చదివిన వాళ్లు హమాలి పని చేసుకోవాలా ? అలాంటప్పుడు మీకెందుకు మంత్రి పదవి అని నిలదీశారు. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి హమాలి పని చేసుకోమని సూచించారు. ఒక మంత్రి స్థానంలో ఉండి ఇంతటి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల ప్రాణాలు అంటే ఈ మంత్రి నిరంజన్‌రెడ్డికి లెక్కలేదని అందుకే సినిమా టిక్కెట్లుతో పోల్చారని ధ్వజమెత్తారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana Politics, YS Sharmila