Ys Sharmila | తెలంగాణలో ప్రస్తుతం పాదయాత్రల సీజన్ నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్రలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే 2 విడతలుగా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టగా..YSRTP అధినేత్రి షర్మిల కూడా చాలా రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిందుకు రేవంత్ రెడ్డి సహా పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో ఇతర నియోజకవర్గాల్లో కూడా హత్ సే హాత్ జోడో యాత్ర చేపడుతున్నారు. ఈ పాదయాత్రలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు..ఒక పార్టీపై మరో పార్టీ నేతలు లేదా పాదయాత్ర సాగే స్థానిక నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై YSRTP అధినేత్రి షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
రేవంత్ తన యాత్రలో వైఎస్సార్ పేరును ప్రస్తావించడంపై ఆమె మండిపడ్డారు. ‘మహానేత YSR పాలన తెస్తా అంటూ ఓటుకు నోటు దొంగ కొత్త జపం చేయడం హాస్యాస్పదం. చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు YSRను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా? మహానేత మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగా కోరు కాదా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ కు YSR గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని' ఫైర్ అయ్యారు. పులి తోలు కప్పుకున్నంత మాత్రాన నక్క పులి కాదు. అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ రేవంత్ రెడ్డి అని ఆమె ఎద్దేవా చేశారు.
‘మహానేత YSR పాలన తెస్తా’ అంటూ ఓటుకు నోటు దొంగ కొత్త జపం చేయడం హాస్యాస్పదం.చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు YSRను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా? మహానేత మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగా కోరు కాదా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ కు YSR గురించి 1/3
— YS Sharmila (@realyssharmila) March 6, 2023
కారులో తిరుగుతూ ఆట విడుపులా పాదయాత్ర చేస్తూ పాదయాత్ర అనే పదాన్ని అపహాస్యం చేస్తున్నాడు. ఇలాంటి ప్రబుద్ధుడు ఊరూరా తిరిగి పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మరు. ఓటుకు నోటు దొంగను జనాలు నమ్మడం లేదని, మహానేత పేరును వాడకుంటున్న రేవంత్ కు YSR అభిమానులే బుద్ధి చెప్తారు. YSR సంక్షేమ పాలన కోసం పుట్టిన ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ. ఆ మహానేత ఆశయ సాధన కోసం 3800 కి.మీ. పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసింది YSR బిడ్డ మాత్రమే అని షర్మిల తెలిపారు.
మరి షర్మిల వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mp revanthreddy, Telangana, YS Sharmila