హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS Sharmila: YS రాజశేఖర్‌రెడ్డిని కుట్ర చేసి చంపారు .. నా మర్డర్‌కి ప్లాన్ చేస్తున్నారు : YSషర్మిల అనుమానం వారిపైనేనా ..?

YS Sharmila: YS రాజశేఖర్‌రెడ్డిని కుట్ర చేసి చంపారు .. నా మర్డర్‌కి ప్లాన్ చేస్తున్నారు : YSషర్మిల అనుమానం వారిపైనేనా ..?

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిల తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణంపై ఆరోపణలు చేశారు. తన తండ్రి చావుపై ఏం కామెంట్స్ చేశారో తెలుసా.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila)సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిల తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhar)Reddyమరణంపై ఆరోపణలు చేశారు. తన తండ్రిని కుట్ర చేసే చంపారంటూ షర్మిల చేసిన ఆరోపణలు ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిగ్ మారాయి. అంతే కాదు తనను కూడా చంపడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ బాంబ్ పేల్చారు షర్మిల. అయితే తాను రాజశేఖర్‌రెడ్డి బిడ్డనని పులి బిడ్డను కాబట్టే అలాంటి వాటికి భయపడనని చెప్పారు. ఈసంకెళ్లు తనను ఆపలేవంటూ ప్రత్యక్షంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే సంకెళ్లు చూపిస్తూ ఈ కామెంట్స్ చేయడంపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ జరుగుతోంది.

చేతకాని దద్దమ్మలకు నేను భయపడను..

రాష్ట్రంలో అవినీతిపై తాను మాట్లాడుతుంటే అధికార పార్టీకి చెందిన నేతలు ఎందుకు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు షర్మిల. తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పాలమూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌పై అభివృద్ధి విషయంలో తాను విమర్శలు చేస్తే సమాధానం చెప్పలేని చేతకాని దద్దమ్మలు తిరిగి తనపైనే కేసు పెట్టారంటూ మండిపడ్డారు. నిరంజన్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అతనిది నోరా లేక మోరినా అంటూ షర్మిల ఘాటు విమర్శలు చేశారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Telangana police jobs, YS Sharmila

ఉత్తమ కథలు