హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS Sharmila : ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడం ముమ్మాటికీ తప్పే : వైఎస్‌ షర్మిల

YS Sharmila : ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడం ముమ్మాటికీ తప్పే : వైఎస్‌ షర్మిల

(Jagan ,Sharmila)

(Jagan ,Sharmila)

YS Sharmila: వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తే వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ విమర్శలు, వివాదాలకు కారణమైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై షర్మిల చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (YSRTP)అధ్యక్షురాలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhar Reddy)కుమార్తే వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ విమర్శలు, వివాదాలకు కారణమైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ(NTR Health University) పేరు మార్పు అంశంపై షర్మిల చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ షర్మిల(YS Sharmila)ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగిస్తే అవమానపరినట్లే అవుతుందన్నారు. అంతే కాదు పేరు తొలగించడం చిన్న అంశం కాదన్ని షర్మిల ఇవాళ పేరు మార్చి ఆ కోట్లాది మంది ఆరాధించే పెద్ద మనిషిని అమానిస్తే ..రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ పేరు మారిస్తే అప్పుడు ఆయన్ని అవమానించినట్లే అవుతుందన్నారు. పాదయాత్రలో భాగంగానే షర్మిల ఇదే అంశంపై ఇంకొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్‌లో దుమారం రేపుతున్నాయి.

Telangana politics : నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు ... కారణం అదేనా..?

అన్నపైనే ఆగ్రహం ..

తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ షర్మిల షడన్‌గా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఏపీలో సీఎంగా ఉన్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇది సరైన నిర్ణయం కాదని తప్పు పట్టారు జగన్ సోదరి వైఎస్ షర్మిల. ఎన్టీఆర్‌ అంటే ప్రజల్లో కోట్లాది మంది ప్రజలకు అభిమానం ఉంది. అలాంటి వ్యక్తి ఖ్యాతి తీసుకొని వైఎస్సార్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఖండించారు. ఒక్కమాటలో చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్‌ వేదికగా తెలిపిన అభిప్రాయాన్నే వైఎస్‌ షర్మిల చెప్పారు. అంతే కాదు వైఎస్ఆర్‌కి ఉన్న ఖ్యాతి ప్రపంచంలోనే మరెవరికి లేదన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోతే ఆ బాధ తట్టుకోలేక 700మంది చనిపోయిన విషయాన్ని ఆమె ఈసందర్భంగా గుర్తు చేశారు. అలాంటి ఖ్యాతి ఉన్న వైఎస్ఆర్‌గకి ఇంకొకరి ఖ్యాతి అవసరం లేదని స్పష్టం చేశారు.

అవమానిస్తారా..?

ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై ఘాఠుగా స్పందించిన వైఎస్ షర్మిల..ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగిస్తే అవమానించినట్లే అవుతుందన్నారు. అంతే కాదు ఆయన్ని అభిమానించే కోట్లాది మందిని అవమానించినట్లే అవుతుందన్నారు. ఇదే అంశాన్ని ఉదాహరిస్తూ రేపు ఏపీలో వచ్చే ప్రభుత్వం వైఎస్‌ఆర్ పేరు మారిస్తే అప్పుడు వైఎస్ఆర్‌ని అవమానించినట్లే అవుతుందని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మరోసారి వస్తుందన్న నమ్మకం లేదనే విషయాన్ని షర్మిల తన మాటల్లో చెప్పకనే చెప్పారు.

నాన్నంటే నాకెంతో ఇష్టం..

నాన్నను తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని ...వైఎస్‌ఆర్‌ను తనకంటే ఎవరూ అంత గొప్పగా ఆరాధించరని చెప్పారు వైఎస్ షర్మిల. తెలంగాణకు నీళ్లు, నియామకాలు, విభజన హామీల అమలు విషయంలో జరుగుతున్న అన్యాయంపై ఏపీ ప్రభుత్వాన్ని ఎకరువు పెడుతూ కేసీఆర్‌ని విమర్శిస్తూ వచ్చారు షర్మిల. ఏపీ సీఎం జగన్‌తో కలిసి స్వీట్లు తినడం కాదు వాటాల గురించి ఎందుకు అడగరంటూ కేసీఆర్‌ని విమర్శించారు వైఎస్ షర్మిల. అయితే ఇప్పుడు హెల్త్‌ యూనివర్సిటీ పేరు తొలగించడంపై మాత్రం డైరెక్ట్‌గా ఏపీ సీఎం జగన్‌ని విమర్శించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

TS Congress: షబ్బీర్ అలీపై కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు.. ప్రియాంకాగాంధీకి లేఖ

ఆ విధంగా ముందుకు..

ప్రజాప్రస్థానం పాదయాత్ర 162వ రోజు వికారాబాద్ జిల్లా కొత్తగడి గ్రామంలో ప్రారంభం అయింది. అక్కడి నుంచి నవాబ్ పేట్, మామ్దన్ పల్లి, ఫుల్ మడ్డి గ్రామాల మీదుగా సాగుతోంది. సాయంత్రం మోమిన్ పేట్ మండలకేంద్రంలో మాట ముచ్చట నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్‌ షర్మిల.

Published by:Siva Nanduri
First published:

Tags: Andhra pradesh news, Ap cm ys jagan mohan reddy, Telangana News, YS Sharmila

ఉత్తమ కథలు