YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (Ys Sharmila) ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతుంది. పాదయాత్రకు అనుమతి, అరెస్ట్ చేసిన పార్టీ నేతలను వదిలిపెట్టే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని వైఎస్ షర్మిల (Ys Sharmila) తెగేసి చెప్తున్నారు. ప్రస్తుతం లోటస్ పాండ్ వద్ద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. లోటస్ పాండ్ (Lotus Pond) చుట్టూ అష్ట దిగ్బంధనం చేసారు. పార్టీ కార్యకర్తలను లోపలికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక టీఆర్ఎస్ సర్కార్ పై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరు, మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవచ్చు. కానీ ప్రజల పక్షాన కొట్లాడే YSR తెలంగాణ పార్టీని మాత్రం ప్రశాంతంగా నిరాహార దీక్షలు కూడా చేసుకోనివ్వడు కేసీఆర్ (Cm Kcr). పోలీసుల భుజాన తుపాకీ పెట్టి ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లు వేస్తున్నాడు. హైకోర్టు (High Court) నుంచి పాదయాత్రకు అనుమతి ఉన్నా కానీ కేసీఆర్ (Cm Kcr) నియంతృత్వ పాలనలో న్యాయస్థానానికి, ప్రజాస్వామ్యానికి విలువ లేదన్నారు. YSR తెలంగాణ పార్టీ శ్రేణులను విడుదల చేసేంత వరకు, పార్టీ శ్రేణులను ఆపే ఈ కర్ఫ్యూ ఎత్తేసేంత వరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టదు వైయస్ షర్మిల (Ys Sharmila) అని చెప్పుకొచ్చారు.
మీరు, మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవచ్చు కానీ ప్రజల పక్షాన కొట్లాడే YSR తెలంగాణ పార్టీని మాత్రం ప్రశాంతంగా నిరాహార దీక్షలు కూడా చేసుకోనివ్వడు కేసీఆర్. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లు వేస్తున్నాడు. హైకోర్టు నుంచి పాదయాత్రకు అనుమతి ఉన్నా.. 1/2 pic.twitter.com/dqKahb6fEe
— YS Sharmila (@realyssharmila) December 10, 2022
ప్రజాస్వామ్యంలో శాంతియుత పోరాటంపై దాష్టీకాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అధికార మదంతో,అహంకారంతో విర్రవీగుతున్న పాలకపక్షానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు. అక్రమ అరెస్టులు ఆగే వరకు, పాదయాత్రకు అనుమతి ఇచ్చేంత వరకు పచ్చి మంచి నీళ్లు తాగకుండా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుందని వైఎస్ షర్మిల (Ys Sharmila) స్పష్టం చేశారు.
కాగా నిన్న బొల్లారం పోలీస్ స్టేషన్ లో YSRTP పార్టీ ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏడుగురిని అరెస్ట్ చేసి ఉంచారు. ఈ క్రమంలో షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని డిమాండ్ తో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తమ నాయకులను వదిలిపెట్టి పాదయాత్రకు అనుమతివ్వాలని షర్మిల భీష్మించుకు కూర్చున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana, Telangana News, Telangana Politics, YS Sharmila, Ys sharmila deeksha, Ysrtp