హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS Sharmila : సంగారెడ్డి పాదయాత్రలో YSషర్మిల పంచ్‌లు ..కేసీఆర్, రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డిని ఏమన్నారంటే

YS Sharmila : సంగారెడ్డి పాదయాత్రలో YSషర్మిల పంచ్‌లు ..కేసీఆర్, రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డిని ఏమన్నారంటే

YS SHARMILA, JAGGAREDDY

YS SHARMILA, JAGGAREDDY

YS Sharmila: తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం వైఎస్ఆర్‌టీపీని పెట్టిన వైఎస్‌ షర్మిల అంతే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ను ఇటు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi), India

తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం వైఎస్ఆర్‌టీపీ(YSRTP)ని పెట్టిన వైఎస్‌ షర్మిల(YS Sharmila) అంతే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌(TRS)ను ఇటు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌(Congress)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పాదయాత్రతో ప్రజల్లో తిరుగుతున్న వైఎస్‌ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్‌(KCR) మూడు వందల రూపాయల చీరలను మహిళలకు ఇచ్చి ..మూడు తరాలకు చేస్తున్న అన్యాయాన్ని కప్పిపుచ్చుతున్నారని మండిపడ్డారు. ఇక టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి(Revanth Reddy)ఓ దొరికిపోయిన దొంగ అంటూ ఆరోపించిన షర్మిల ..ఆయన కేసీఆర్‌ చేతిలో కీలుబొమ్మ అని ..సీఎం ఎప్పుడు కన్నెర్ర చేస్తే అప్పుడు మళ్లీ జైల్లో చిప్ప కూడు తినక తప్పదని ఘాటు విమర్శలు చేశారు. ఇక తాను బీజేపీ వదిలిన బాణం అంటూ విమర్శలు చేసిన జగ్గారెడ్డి(Jaggareddy)కి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు వైఎస్ షర్మిల.

Bathukamma 2022: తెలంగాణలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు .. ఆడపడుచులకు అమిత్‌షా శుభాకాంక్షలు

ఎవర్ని వదలని షర్మిల..

తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ షర్మిల విమర్శల విషయంలో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ను ఒకే తాటికి కట్టి మరీ విమర్శిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పాతబస్టాండ్ దగ్గర జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మొదల్కొని ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు జిల్లా కలెక్టర్‌పై విమర్శలు గుప్పించారు. ముందుగా తెలంగాణ ఆడబిడ్డలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు రాజన్న బిడ్డ. 8ఏళ్లలో కేసీఆర్‌ ప్రజలను ప్రతి పథకం పేరుతో మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లాకు ఎకరాకు కూడా సాగునీరవ్వలేదన్నారు. ఐఐటీ తెచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌దేన్న షర్మిల రీజనల్ రింగ్‌రోడ్డు పేరుతో సంగారెడ్డిలో కేసీఅర్ ప్రభుత్వం భూములు గుంజుకుందని విమర్శించారు.

విమర్శనాస్త్రాలు..

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గతంలో షర్మిలకు తెలగాణలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది..బీజేపీ వదిలిన బాణం అంటూ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారామె. రోజుకో పార్టీ మారే జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే అర్ధం కావడం లేదని సెటైర్ వేశారు. నియోజకవర్గ సమస్యలపై ఏ రోజైనా కేసీఆర్‌తో కొట్లాడారా అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ హయాంలో చేసిన అభివృద్ధి కారణంగానే సంగారెడ్డిలో జగ్గారెడ్డికి పేరొచ్చిందన్నారు షర్మిల. తాను వైఎస్ఆర్ బిడ్డనని వైఎస్ఆర్‌ సంక్షేమం కోసం వదిలిన బాణాన్ని అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు.

Himanshu Rao : సన్నబడ్డ హిమాన్షురావు కల్వకుంట్ల .. వైరల్ అవుతున్న వెరైటీ లుక్‌ ఫోటోస్

దొంగల రాజ్యంగా అభివర్ణన..

చివరగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని వదల్లేదు వైఎస్ షర్మిల. దొంగతనం చేసి దొరికిపోయిన టీపీసీసీ చీఫ్‌ పిలక కేసీఅర్ చేతిలో ఉందన్నారు. అందుకే కేసీఆర్ చెప్పినట్లు వింటున్నారని..అలాంటి వ్యక్తుల కింద పని చేస్తున్న జగ్గారెడ్డి కూడా తనను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు షర్మిల. సంగారెడ్డి జిల్లాకు కలెక్టర్‌గా ఉన్న శరత్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ అభినవ అంబేద్కర్ అనడంపై టీఆర్ఎస్‌ కండువా కప్పుకొని కూర్చున్నారా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏ యాంగిల్ లో అంబేడ్కర్ లా కనిపించారని ప్రశ్నించారు షర్మిల. సంగారెడ్డి పాదయాత్రలో షర్మిలకు స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది.

Published by:Siva Nanduri
First published:

Tags: Telangana Politics, YS Sharmila

ఉత్తమ కథలు