హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS Sharmila : జగ్గారెడ్డి నువ్ బెదిరిస్తే భయపడటానికి నేను ఎవరనుకుంటున్నావ్ .. పులిబిడ్డని: వైఎస్‌ షర్మిల

YS Sharmila : జగ్గారెడ్డి నువ్ బెదిరిస్తే భయపడటానికి నేను ఎవరనుకుంటున్నావ్ .. పులిబిడ్డని: వైఎస్‌ షర్మిల

YS Sharmila: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మధ్య వాడి, వేడీ సవాళ్లు, విమర్శలతో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి.  అసలు ఎవరీ జగ్గారెడ్డి...అతని ఛాలెంజ్‌కి  రాజశేఖర్‌రెడ్డి బిడ్డనైన నేను  భయపడటం ఏమిటని రివర్స్‌ అటాక్ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi), India

సంగారెడ్డి(Sangareddy)ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy), వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila)మధ్య వాడి, వేడీ సవాళ్లు, విమర్శలతో తెలంగాణ(Telangana) రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. పటాన్‌చెరు (Patancheru) లో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ షర్మిల కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు ఎవరీ జగ్గారెడ్డి...అతని ఛాలెంజ్‌కి రాజశేఖర్‌రెడ్డి (Rajasekhar Reddy)బిడ్డనైన నేను భయపడటం ఏమిటని రివర్స్‌ అటాక్ చేశారు. తన తండ్రి చనిపోయిన సమయంలో తాము బాధపడకుండా రాజకీయాలు చేశామని కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలన్ని అవాస్తమని షర్మిల మండిపడ్డారు. ఆ సమయంలో చెట్టంత మనిషిని కోల్పోయిన తాము బ్రతుకు తామో చస్తామో అన్నంతగా బాధపడిన విషయం జగ్గారెడ్డికి ఏం తెలుసని విమర్శలు చేశారు.

Hyderabad : హైదరాబాద్‌లో అమ్మవారి విగ్రహాల ధ్వంసం .. ఇద్దరు మైనార్టీ మహిళల్ని విచారిస్తున్న పోలీసులు

జగ్గయ్యపై షర్మిల ఫైర్ ..

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కి చేరుకుంటోంది. పూటకో పార్టీ మార్చే వ్యక్తి జగ్గారెడ్డి వల్ల నియోజకవర్గానికి ఏం మేలు జరిగిందని చేసిన షర్మిల విమర్శలకు జగ్గారెడ్డి ప్రెస్‌ మీట్ పెట్టి మరీ రెండ్రోజుల నుంచి విమర్శిస్తున్నారు. ఈ విమర్శల్లో భాగంగానే వైఎస్‌ఆర్‌ చనిపోతే షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు బాధపడలేదని ...సీఎం కుర్చి కోసం స్కెచ్ వేశారని చెప్పిన జగ్గారెడ్డి మాటలకు పటాన్‌చెరు పాదయాత్రలో కౌంటర్ ఇచ్చారు షర్మిల. అసలు జగ్గారెడ్డి ఎవరని మొదలుపెట్టిన షర్మిల వైఎస్ఆర్‌ చనిపోతే మేం ఎంతగా బాధపడ్డామో జగ్గారెడ్డికి ఏం తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి మాట్లాడేవన్ని పచ్చి అబద్దాలన్నారు షర్మిల.

పంచ్‌కు పంచ్ ..

ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవాళ తనను బెదిరించాడట...ఇంకో సారి మాట్లాడితే బాగోదని వార్నింగ్ ఇస్తారట. అలాంటి వాళ్లకు భయపడే వ్యక్తి తాను కాదని తాను వైఎస్‌ఆర్‌ బిడ్డనని ఈ రాజశేఖర్ బిడ్డ.. ఎవడికి భయపడేది కాదని మరోసారి స్పష్టం చేశారు. పాలమూరు ఎమ్మెల్యేలంతా కలిసి స్పీకర్‌కి ఫిర్యాదు చేస్తేనే తాను భయపడలేదన్నారు. ఒక మంత్రి తన మీద ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేస్తేనే దమ్ముంటే అరెస్ట్ చేయమని సంకెళ్లు చూపించిన తాను సంగారెడ్డి ఎమ్మెల్యే చేసిన ఛాలెంజ్‌కి భయపడతానని అనుకోవద్దని జగ్గారెడ్డికి కౌంటర్ ఇచ్చారు షర్మిల.

Teenmar Mallanna : పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ డీజీపీకి తీన్మార్ మల్లన్న వరుస ట్వీట్‌లు ..ఏమని చేశారంటే..

ఎవరూ తగ్గట్లేదు..

మంగళవారం ఉదయం జగ్గారెడ్డి ప్రెస్‌మీట్‌ తర్వాత పెట్టి మరీ తెలంగాణలో షర్మిల ఎంత తిరిగిన ప్రయోజనం ఉండదని వైఎస్‌ షర్మిల ఎవరు వదిలిన బాణమో నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు. అంతే కాదు తెలంగాణలో టీఆర్ఎస్‌ లేదంటే కాంగ్రెస్‌ తప్ప మరో పార్టీ అధికారంలోకి రాదన్నారు. షర్మిలకు సీఎం కుర్చి కావాలంటే కుటుంబ సభ్యులంతా కలిసి ప్రధాని దగ్గర పంచాయితీ పెట్టుకొని ఏపీలోని మూడు రాజధానులు కాకుండా మూడు రాష్ట్రాలుగా మార్చి కర్నూలుకు సీఎంగా చేయమని కోరుకుంటే బాగుంటదని సెటైర్ వేశారు జగ్గారెడ్డి. ఆయన ఉదయం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గానే షర్మిల పాదయాత్రలో రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Jagga Reddy, Telangana Politics, YS Sharmila

ఉత్తమ కథలు