Home /News /telangana /

TS POLITICS WILL YSRTP PRESIDENT YS SHARMILA AND BSP CONVENOR RS PRAVEEN KUMAR WILL CHANGE TRS BJP CONGRESS FATE IN TELANGANA AK

TS Politics: తెలంగాణలో ఆ ఇద్దరికీ అంత శక్తి ఉందా ? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, రాత మార్చేస్తారా?

తెలంగాణ మ్యాప్

తెలంగాణ మ్యాప్

Telangana News: తెలంగాణ రాజకీయాల్లో తమ ప్రభావం చూపేందుకు పలు ఇతర పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి.

    ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పోటీ అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. ఈ మూడు పార్టీల మధ్యే వచ్చే ఎన్నికల్లో పోటీ ఉంటుందన్నది విశ్లేషకుల మాట. ఇక కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరు టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తారన్నది ప్రస్తుతానికి ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. అయితే కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్‌కు(TRS) కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురైతే.. మరికొన్ని చోట్ల బీజేపీ నుంచి పోటీ ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణ(Telangana) రాజకీయాల్లో తమ ప్రభావం చూపేందుకు పలు ఇతర పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. అయితే తెలంగాణలో ఒకప్పుడు సత్తా చాటిన సీపీఎం, సీపీఐ రాబోయే ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తాయన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.

    అయితే వచ్చే ఎన్నికల్లో ఏదో రకంగా తమ ఉనికి, సత్తా చాటాలని ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒకరు దివంగత వైఎస్ఆర్ కూతురు షర్మిల(YS Sharmila) కాగా.. మరొకరు మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen kumar). వైఎస్ఆర్‌టీపీ పార్టీని ఏర్పాటు చేసుకుని తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే పనిలో షర్మిల ఉన్నారు. ఇందుకోసం కొన్ని నెలలుగా ఆమె పాదయాత్ర కూడా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే ప్రకటించారు. ఇక ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సీరియస్‌గానే రాజకీయాలపై ఫోకస్ చేశారు.



    అణగారిన వర్గాలు, బలహీనవర్గాలను దగ్గరై వారి బలంతో రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం పార్టీ పెట్టుకుండా బీఎస్పీలో చేరారు. ఇటు షర్మిల, అటు ప్రవీణ్ కుమార్ ఇద్దరూ లక్ష్యంగా పెట్టుకున్న సామాజికవర్గాలు దాదాపు ఒకటే కావడంతో.. ఈ ఇద్దరు ప్రధాన పార్టీలకు ఏ మేరకు పోటీ ఇస్తారన్న దానిపై ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో త్రిముఖ పోటీ ఉంటే.. అప్పుడు గెలుపోటములను శాసించే ఓట్ల సంఖ్య తక్కువగా ఉంటుందనే వాదన ఉంది.

    Mulugu: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌లో మట్టి బిడ్డ : ఫస్టియర్ బైపీసీలో టాపర్ ఈ గిరిజన బాలిక

    TRS | BJP : బీజేపీకి షాకిచ్చిన టీఆర్ఎస్.. జాతీయ భేటీ, మోదీ సభ వేళ ఎటుచూసినా కేసీఆర్!

    అలాంటి సందర్భం వస్తే వీరి సారథ్యంలోని రాజకీయ పార్టీలకు పలు నియోజకవర్గాల్లో పడే ఓట్లు.. ప్రధాన రాజకీయ పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. వీరి సారథ్యంలోని పార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో ఓట్లు సాధించినా.. అంతిమంగా అవి ప్రధాన రాజకీయ పార్టీల గెలుపోటములను తారు చేసే పరిస్థితి ఉండొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలను ప్రధాన రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోకపోయినా.. అంతర్గతంగా మాత్రం ఈ పార్టీల ద్వారా తమకు ఎలాంటి రాజకీయ ముప్పు ఉంటుందనే టెన్షన్ పార్టీల్లో ఎంతోకొంత ఉంటుందనే వాదన వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Rs praveen kumar, Telangana, YS Sharmila

    తదుపరి వార్తలు