హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS Sharmila: షర్మిలకు ఇప్పటికైనా పొలిటికల్ మైలేజీ వస్తుందా ? ఆ పరిస్థితి మారకపోతే అంతేనా ?

YS Sharmila: షర్మిలకు ఇప్పటికైనా పొలిటికల్ మైలేజీ వస్తుందా ? ఆ పరిస్థితి మారకపోతే అంతేనా ?

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila: ఇప్పటివరకు షర్మిలను పట్టించుకోని టీఆర్ఎస్..కొద్దిరోజులుగా ఆమెను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో షర్మిల మెల్లిమెల్లిగా హైలెట్ అవుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణవ్యాప్తంగా 3500 కిలోమీటర్ల మేర పాదయాత్రను పూర్తి చేసుకున్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను (YS Sharmila) నర్సంపేటలో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించింది ప్రభుత్వం. హైదరాబాద్ వచ్చిన షర్మిల.. కేసీఆర్‌(KCR) అధికారిక నివాసానికి దాడి జరిగిన వాహనంలో వచ్చేందుకు ప్రయత్నించడం... ఆమెను పోలీసులు అడ్డుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం.. చివరకు రాత్రి సమయంలో న్యాయమూర్తి ఆమెకు బెయిల్ మంజూరు చేయడం వంటి ఘటనలో ఒక రోజంతా హైడ్రామా నడిచింది. ఊహించని ఈ పరిణామాలతో పాదయాత్రతో లభించని పొలిటికల్ ఫోకస్ షర్మిలకు లభించిందనే చర్చ జరుగుతోంది.

ఇప్పటివరకు షర్మిలను పట్టించుకోని టీఆర్ఎస్ ..కొద్దిరోజులుగా ఆమెను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దీంతో తెలంగాణ (Telangana) రాజకీయాల్లో షర్మిల మెల్లిమెల్లిగా హైలెట్ అవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆమె పార్టీకి బలం లేకపోయినా.. జరుగుతున్న పరిణామాలతో ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఊహించని ఈ పరిణామాలతో వైఎస్ షర్మిలకు తెలంగాణలో పొలిటికల్ మైలేజీ దక్కుతుందా ? అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది.

నిజానికి సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పటికీ.. షర్మిల పార్టీలో ఇప్పటివరకు పేరున్న పెద్ద నాయకుడు ఒక్కరు కూడా చేరలేదు. ఆ మాటకొస్తే నియోజకవర్గస్థాయిలో పోటీ చేయడానికి బలమైన నేతలు కూడా ఆమె పార్టీలో చేరిన దాఖలాలు లేవనే చెప్పాలి. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిలపై రాజకీయాల్లో కొంతమేర ఫోకస్ పెరగడంతో.. ఆమె రాజకీయ పార్టీకి ఇదే అసలైన పరీక్షా కాలంగా కనిపిస్తోంది. తన పాదయాత్రను ఎక్కడైతే అడ్డుకున్నారో.. అక్కడి నుంచి కొనసాగిస్తానని షర్మిల స్పష్టం చేశారు.

Telangana Jobs: తెలంగాణలో మరో 3,897 ఉద్యోగాల భర్తీకి అనుమతులు.. ఏ శాఖలో అంటే?

ఫ్లాష్: కేసీఆర్ కుటుంబంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..నాకేం జరిగిన వారిదే బాధ్యత అంటూ..

ఈ క్రమంలో ఇప్పటి నుంచైనా షర్మిల పార్టీలోకి వలసలు ఉంటాయా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏ రాజకీయ పార్టీ అయినా ఎదుగుతున్న సంకేతాలు వలసల ద్వారానే ప్రజల్లోకి వెళుతుంది. అయితే షర్మిల పార్టీకి వలసల లేకపోవడమే పెద్ద మైనస్ అనే వాదన చాలాకాలంగా ఉంది. ఒకవేళ పేరున్న నేతలు ఆ పార్టీలో చేరి ఉంటే.. ఇప్పటికే ఆమె పార్టీ కొంతమేర ప్రభావం చూపించి ఉండేదనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు షర్మిల పార్టీపై పలు కారణాల వల్ల ఫోకస్ పెరగడంతో.. ఇకనైనా ఆమె పార్టీ వైపు చూసే నేతలు ఉంటారా ? అన్నది తెలియాల్సి ఉంది.

First published:

Tags: Telangana, YS Sharmila

ఉత్తమ కథలు