Home /News /telangana /

TS POLITICS WILL TRS TAKE MUNUGODU BY ELECTION IN A LIGHT MODE KTR ANSWER ON BY ELECTION GIVE SIGNALS AK

KTR-Munugodu: మునుగోడును టీఆర్ఎస్ లైట్ తీసుకుంటుందా ?.. కేటీఆర్ మాటలకు అర్థమేంటి ?

కేటీఆర్, మునుగోడు (ప్రతీకాత్మక చిత్రం)

కేటీఆర్, మునుగోడు (ప్రతీకాత్మక చిత్రం)

Munugodu By Elections: హుజూరాబాద్‌లో బీజేపీ చేతిలో భంగపడ్డ టీఆర్ఎస్.. మునుగోడు మాత్రం ఆ పార్టీకి షాక్ ఇచ్చేలా పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డ రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక ఖాయమైంది. అక్కడ బీజేపీ తరపున మరోసారి పోటీ చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిద్ధమవుతుంటే.. తమ సిట్టింగ్ సీటును నిలుపుకోవడానికి కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డటానికి రెడీ అయ్యింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందకముందే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ సభకు కూడా ఏర్పాటు చేసింది. అయితే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ఏం ఆలోచిస్తోందనే అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇక్కడ పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందని.. కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు ధీటుగా ఓట్లు సాధిస్తే అదే గొప్ప విషయమని చాలామంది భావిస్తున్నారు.

    అయితే హుజూరాబాద్‌లో(Huzurabad) బీజేపీ చేతిలో భంగపడ్డ టీఆర్ఎస్.. మునుగోడు(Munugodu) మాత్రం ఆ పార్టీకి షాక్ ఇచ్చేలా పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే తాజాగా ఈ ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ట్విట్టర్‌లో ఆస్క్ కేటీఆర్ పేరుతో నెటిజన్లతో చాట్ చేసిన కేటీఆర్.. పలువురి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మీ కామెంట్ ఏంటని కొందరు అడగ్గా.. ఉప ఎన్నికల ప్రకటన రానివ్వండని వ్యాఖ్యానించారు.



    తనకు తెలిసినంతవరకు మునుగోడు అంశం కేవలం మరో ఉపఎన్నిక మాత్రమే అని.. దానితో ఏం మారుతుందని ప్రశ్నించారు. తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా రాష్ట్రంలో బీజేపీకి మరింత అనుకూలమైన రాజకీయ వాతావరణం ఏర్పడుతుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. అందుకోసమే ఈ ఉప ఎన్నిక వచ్చేలా ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేసిందనే చర్చ కూడా కొంతకాలంగా సాగుతోంది. అయితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఇక కేవలం ఒక ఉప ఎన్నిక మాత్రమే అంటూ దీన్ని లైట్ తీసుకున్నారు.

    Revanth Reddy Versus Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి కౌంటర్.. వీటికి సమాధానం చెప్పాలంటూ...

    Telangana Congress: రాబోయే 15 రోజుల్లో ఏం జరగనుంది ?.. తెలంగాణ కాంగ్రెస్‌లో టెన్షన్

    దీంతో టీఆర్ఎస్ కూడా మునుగోడును కేవలం ఒక ఉప ఎన్నిక మాత్రమే అనుకుని దానికి గత ఉప ఎన్నికలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటుందా ? అనే చర్చ కూడా సాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు అనవసరంగా ఎక్కువ హైప్ ఇచ్చామని.. ఈసారి అలా జరగకుండా చూడాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్‌కు కూడా కీలకమే కావడంతో.. కేటీఆర్ చెప్పిన మాటలకు తగ్గట్టుగానే టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకుంటుందా ? లేక బీజేపీ తరహాలోనే సీరియస్‌గా ఈ సీటుపై ఫోకస్ చేస్తుందా ? అన్ని మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: KTR, Munugodu By Election, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు