Home /News /telangana /

TS POLITICS WILL TRS MINISTER JAGADISH REDDY ONCE AGAIN PLAY KEY ROLE IN VICTORY OF MUNUGODU BY ELECTIONS IN TELANGANA AK

Munugodu: మునుగోడు ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ మంత్రి హ్యాట్రిక్ కొడతారా ?.. హరీశ్ రావును మరిపిస్తారా ?

మంత్రి జగదీశ్ రెడ్డి (ఫైల్ ఫోటో)

మంత్రి జగదీశ్ రెడ్డి (ఫైల్ ఫోటో)

TS Politics: 2018 తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోనూ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. మొదటది ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా కారణంగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాగా.. రెండోది నోముల నర్సింహయ్య మరణం కారణంగా వచ్చిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణలో మునుగోడు సీటుకు ఉప ఎన్నిక రాబోతోంది. ఉప ఎన్నిక జరగడం దాదాపు ఖాయం కావడంతో.. ఈ సీటును గెలుచుకోడంపై టీఆర్ఎస్ ఫోకస్ చేసింది. రాజగోపాల్ రెడ్డిని(komatireddy rajagopal reddy0 మళ్లీ బరిలోకి దింపడం ద్వారా విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక అధికార టీఆర్ఎస్ మునుగోడు (Munugodu) విషయంలో ఏ రకమైన వ్యూహంతో ఉందనే విషయం ఇంకా తెలియకపోయినా.. బీజేపీని ఓడించి ఈ సీటును గెలుచుకోవడం టీఆర్ఎస్‌కు అత్యంత అవసరం. తెలంగాణ రాజకీయాల్లో తామే నంబర్‌వన్ అని నిరూపించుకోవాలంటే.. టీఆర్ఎస్(TRS) ఎట్టి పరిస్థితుల్లోనూ మునుగోడు సీటును తమ ఖాతాలో వేసుకోవాల్సి ఉంటుంది. అయితే టీఆర్ఎస్ వర్గాల్లో ఈ ఉప ఎన్నిక గురించి మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

    2018 తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోనూ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. మొదటది ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా కారణంగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాగా.. రెండోది నోముల నర్సింహయ్య మరణం కారణంగా వచ్చిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక. ఈ రెండు సీట్లను కూడా అధికార టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇప్పుడు మునుగోడు కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోకి వచ్చే స్థానమే. టీఆర్ఎస్ గతంలో గెలుచుకున్న హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల గెలుపులో ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ రకంగా ఆ రెండు సీట్లు టీఆర్ఎస్ ఖాతాలో ఉండేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.



    తాజాగా మరోసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడుకు ఉప ఎన్నిక రావడంతో.. ఇక్కడ మరోసారి టీఆర్ఎస్‌ను గెలిపించి మంత్రి జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ కొడతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి హరీశ్ రావు స్థాయిలో వ్యూహకర్త కాకపోయినా.. హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపించడంతో తనదైన పాత్ర పోషించారు. క్షేత్రస్థాయిలో కేసీఆర్ వ్యూహాలను, సూచనలు సమర్థవంతంగా అమలు చేసి సక్సెస్ అయ్యారు.

    Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్‌ను డైలమాలో పడేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ?

    TS Politics: తుమ్మల చెప్పిన పిడుగు పడటం అంటే అదేనా ?.. కేసీఆర్ ప్లాన్ మార్చేశారా ?

    తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లోనూ జగదీశ్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే... ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌ను గెలిపించిన జిల్లా మంత్రిగా ఆయన హ్యాట్రిక్ సాధించినట్టు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మునుగోడులో పార్టీ గెలుపు కోసం కేసీఆర్ సూచనల మేరకు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని తన పని మొదలుపెట్టారు మంత్రి జగదీశ్ రెడ్డి. మరికొద్దిరోజుల్లోనూ ఆయన మునుగోడు ఉప ఎన్నికల పోరులో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Munugodu By Election, Telangana, Trs

    తదుపరి వార్తలు