Home /News /telangana /

TS POLITICS WILL TRS MAKE MUNUGODU AS HUZURABAD WILL NEW SCHEMES AHEAD OF BY ELECTIONS AK

TRS: టీఆర్ఎస్ ‘మునుగోడు’ను మరో ‘హుజూరాబాద్‌’గా మార్చుతుందా ?.. అదే జరిగితే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TRS: తాజాగా మునుగోడు ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ఏ రకమైన వ్యూహంతో ముందుకు సాగుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

    రాజకీయ పార్టీలు ఏం చేసినా.. అందులో రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తుంటాయి. ఆ ప్రయోజనం ఎంతోకొంత తమకు దక్కుతుందని భావిస్తేనే.. ఏమైనా చేసేందుకు ప్లాన్ చేస్తుంటాయి. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. గత ఏడాది జరిగిన హుజూరాబాద్ (Huzurabad )ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ అనేక పథకాలు తీసుకొచ్చింది. దళితుల కోసం దళితబంధు పథకం తీసుకొచ్చి.. పైలెట్ ప్రాజెక్టుగా దాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేసింది. ఫలితంగా అక్కడ ఉప ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నాలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తరువాత తెలంగాణవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా.. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఈ పథకం అమలు మందగించిందనే వాదన ఉంది.

    ఆ తరువాత హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఆశించిన ఫలితం రాకపోవడంతో... దీని గురించి పెద్దగా చర్చ కూడా జరగడం లేదు. ఇక తాజాగా మునుగోడు(Munugodu) అసెంబ్లీ ఉపఎన్నిక తెరపైకి రావడంతో.. టీఆర్ఎస్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతుందా ? అనే చర్చ జరుగుతోంది. దళితబంధు, కేసీఆర్ సభల కారణంగా హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఎక్కువగా హైప్ వచ్చింది. టీఆర్ఎస్(TRS) ట్రబుల్ షూటర్ హరీశ్ రావు రంగంలోకి దిగి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు తీవ్రంగా కృషి చేయడంతో తెలంగాణ రాజకీయవర్గాల దృష్టి హుజూరాబాద్ మీద పడింది.



    అయితే తాజాగా మునుగోడు ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ఏ రకమైన వ్యూహంతో ముందుకు సాగుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. తన రాజీనామాతో అయినా మునుగోడు అభివృద్ధి జరుగుతుందని, ఇక్కడ ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల సందర్భంగా మునుగోడులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకమైన పథకాలు తీసుకొచ్చినా.. అభివృద్ధి చేసినా అదంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కారణంగానే అనే ప్రచారం జరుగుతుంది.

    Munugode Bypoll : మునుగోడుకు భారీగా నిధులు.. అమల్లోకి CM KCR హామీలు.. కోమటిరెడ్డి కోరిందే?

    Telangana: టీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనుందా ?.. ఆ మాజీమంత్రి మాటలకు అర్థమేంటి ?

    దీనికి తోడు తన రాజీనామా తరువాత మునుగోడుకు ప్రభుత్వం ఏం చేసినా.. అదంతా తన ఖాతాలో వేసుకోవడానికి బీజేపీ తరపున బరిలోకి దిగనున్న రాజగోపాల్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. దీంతో మునుగోడు విషయంలో టీఆర్ఎస్ హుజూరాబాద్ తరహాలోనే ముందుకు సాగుతుందా ? లేక సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ఇంకా తన వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టకపోవడంతో.. ఈ విషయంలో టీఆర్ఎస్ ఏం చేస్తుందనే ఆసక్తి నెలకొంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Munugodu By Election, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు