హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS| Munugodu: మునుగోడు టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న రగడ.. ఆ నేతల స్వరం పెరిగిందా ?

TRS| Munugodu: మునుగోడు టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న రగడ.. ఆ నేతల స్వరం పెరిగిందా ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: ఒకవేళ పరిస్థితి ఇదే రకంగా ఉంటే.. రాబోయే రోజుల్లో ఆ అసంతృప్తి ప్రభావం టీఆర్ఎస్ గెలుపుపై ఉండొచ్చని ఆ పార్టీ వర్గాల్లోనే టాక్ వినిపిస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మునుగోడులో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో టీఆర్ఎస్ ఉంది. ఇందుకోసం ఎన్ని చేయాలో అన్నీ చేస్తోంది ఆ పార్టీ. అయితే ఇప్పటివరకు మునుగోడులో తమ పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై మాత్రం గులాబీ బాస్ క్లారిటీ ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేసినప్పటికీ.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాతే అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించాలని టీఆర్ఎస్ బాస్ నిర్ణయం తీసుకున్నారు. అయితే మునుగోడు (Munugodu) అభ్యర్థి ఎంపిక టీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పులు తీసుకొస్తోందనే చర్చ చాలాకాలంగా సాగుతోంది. మునుగోడులో బీసీ అభ్యర్థికి పోటీ చేసే ఛాన్స్ ఇవ్వాలని ఆ వర్గం నేతలు కోరుతూ వచ్చారు. కానీ టీఆర్ఎస్(TRS)  నాయకత్వం మాత్రం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల వైపే మొగ్గుచూసింది.

  బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీలో ఉండటంతో.. టీఆర్ఎస్ కూడా రెడ్డి వర్గానికి చెందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతోంది. అయితే ఈ అంశంపై టీఆర్ఎస్‌కు చెందిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

  నిన్న మునుగోడు నియోజకవర్గ పరిధిలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కర్నె ప్రభాకర్.. కొందరు అగ్రకులాల వాళ్లు పదవులు తమకే ఉండాలన్నట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పరోక్షంగా ఆయన మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ (Bura Narsaiah Goud) కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఆత్మీయ సమావేశాలకు తనను ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

  తనకు టీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని.. మిగతా లిల్లీపుట్లను తాను పట్టించుకోనని పరోక్షంగా మంత్రి జగదీష్ రెడ్డిని విమర్శించారు. అయితే నాయకులు ఈ రకంగా పార్టీ తీవ్ర పట్ల అసంతృప్తితో ఉంటే.. ముఖ్యనేతలు మాత్రం వారిని బుజ్జగించి కలుపుకుని పోయేందుకు ప్రయత్నాలు చేయడం లేదనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఒకవేళ పరిస్థితి ఇదే రకంగా ఉంటే.. రాబోయే రోజుల్లో ఆ అసంతృప్తి ప్రభావం టీఆర్ఎస్ గెలుపుపై ఉండొచ్చని ఆ పార్టీ వర్గాల్లోనే టాక్ వినిపిస్తోంది.

  Indrakaran Reddy : దళిత బంధు పథకం మా ఇష్టం వచ్చినోళ్లకి ఇస్తం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

  ఆ ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏపీపై ఫోకస్ చేస్తున్నారా ?.. ఇదేం లెక్క ?

  అయితే మునుగోడు గెలుపు బాధ్యతలను తీసుకున్న జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం ఈ విషయంలో తాను అనుకున్నట్టుగానే ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. కొంతమంది నేతలను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం. అయితే పార్టీ అధినాయకత్వం సూచన మేరకే ఆయన ముందుకు సాగుతున్నారని.. కాబట్టి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలను టీఆర్ఎస్ నాయకత్వం కూడా పట్టించుకోవడం లేదని భావించాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Munugodu By Election, Telangana, Trs

  ఉత్తమ కథలు