తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు మునుగోడు ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ గెలవడం కోసం టీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డుతోంది. ఇక్కడ తమకు ఇబ్బంది కలిగించే పరిణామాలను ముందుగానే ఊహిస్తున్న టీఆర్ఎస్.. వాటిని అధిగమించేందుకు ఉన్న అన్ని మార్గాల్లో తమ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో తమను ఓడించిన కొన్ని ఎన్నికల గుర్తులు ఈసారి తమను మళ్లీ ముంచకుండా ఉండేందుకు ముందుగానే ఈసీ తలుపుతట్టింది టీఆర్ఎస్.. టీఆర్ఎస్(TRS) కారు గుర్తును పోలిక కొన్ని గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కోరింది. అయితే ఇందుకు ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది.
అయితే టీఆర్ఎస్ వాదనను హైకోర్టు తోసిపుచ్చడంతో.. అధికార పార్టీకి ఎన్నికల్లో పెద్ద సవాల్ ఎదురుకాబోతోంది. మునుగోడు(Munugodu Bye Elections) ఉప ఎన్నికల్లో ఓట్లు సాధించడంతో పాటు తమ ఓట్లు కారు గుర్తును పోలిన ఇతర గుర్తులకు పడకుండా ఉండేలా చూసుకోవడం కూడా టీఆర్ఎస్ ముందు ఉన్న అతి పెద్ద సవాల్. గతంలో అనేకసార్లు హోరాహోరీ పోటీ ఎదురైన సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తుల కారణంగా ఓటమి చవిచూసింది. అందుకే ఈసారి ముందుగానే మేల్కొని గుర్తుల విషయంలో ఈసీకి ఫిర్యాదు చేసింది.
కానీ వారికి ఈ విషయంలో ఊరట లభించకపోవడంతో.. క్షేత్రస్థాయిలోనే ఇక గుర్తుల విషయంలో తమ ఓటర్లకు మరింత ఎక్కువగా అవగాహన కల్పించడం టీఆర్ఎస్కు అత్యవసరంగా మారిపోయింది. దీంతో టీఆర్ఎస్ ఈ విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Janasena | Telangana : తెలంగాణలో జనసేన పోటీ చేయడం పక్కా .. పవన్ కల్యాణ్ చెప్పింది ఎన్ని స్థానాల్లో అంటే
ఫ్లాష్..ఫ్లాష్: మునుగోడు ఉపఎన్నిక వేళ TRSకు బిగ్ షాక్..పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
మునుగోడు ఉపఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy), కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి (Sravanthi), టీఆర్ఎస్ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Koosukuntla prabhakar reddy) ఉన్నారు. నిన్నటితో మునుగోడు బైపోల్ (Munugodu By poll) లో నామినేషన్ ఉపసంహరణ ఘట్టం ముగిసింది. మునుగోడు బైపోల్ (Munugodu By poll) లో మొత్తం 130 మంది నామినేషన్లు దాఖలు చేయగా..83 సరైనవి కావని అధికారులు తేల్చారు. ఈ 83 నామినేషన్లలో 36 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు తెలుస్తుంది.. దీనితో మునుగోడు (Munugodu) బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Munugodu By Election, Telangana