హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR: మునుగోడు బరిలో ఉండేది టీఆర్ఎస్సా..? లేక బీఆర్ఎస్సా..?.. కేసీఆర్ ప్రకటనపై ఉత్కంఠ

KCR: మునుగోడు బరిలో ఉండేది టీఆర్ఎస్సా..? లేక బీఆర్ఎస్సా..?.. కేసీఆర్ ప్రకటనపై ఉత్కంఠ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TRS: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిన తరువాత కేసీఆర్ జాతీయ ప్రకటన ఉంటుందో లేదో అనే చర్చలు మొదలయ్యయి. అయితే అలాంటి పుకార్లకు చెక్ చెప్పారు కేసీఆర్.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  దసరా రోజు జాతీయ పార్టీపై ప్రకటన చేస్తామని చెప్పారు టీఆర్ఎస్(TRS) అధినేత కేసీఆర్. ఇందుకు సంబంధించి పార్టీ నేతలతో సమాలోచనలు కూడా దాదాపుగా పూర్తిగా చేశారు. ఆదివారం దీనిపైనే పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించి ఓ నిర్ణయానికి కూడా వచ్చారని తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా దసరా(Dussera) రోజున ప్రకటించబోయే జాతీయ పార్టీ ద్వారానే మునుగోడు ఉప ఎన్నికల(Munugodu Bye Election) బరిలో ఉంటామని కేసీఆర్(KCR) పార్టీ నేతలకు స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇంత తొందరగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందని టీఆర్ఎస్ ఊహించి ఉండకపోవచ్చు. కానీ కేసీఆర్ పార్టీ నేతలతో ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈసీ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడంతో..ఈ ఉప ఎన్నిక మరింత హాట్ టాపిక్‌గా మారింది.

  మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిన తరువాత కేసీఆర్ జాతీయ ప్రకటన ఉంటుందో లేదో అనే చర్చలు మొదలయ్యయి. అయితే అలాంటి పుకార్లకు చెక్ చెప్పారు కేసీఆర్. అనుకున్నట్టుగానే దసరా రోజున జాతీయ పార్టీపై ప్రకటన ఉంటుందని.. పార్టీ నేతలంతా ముందుగా చెప్పిన సమయానికి టీఆర్ఎస్ భవన్‌కు చేరుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు అందరిలోనూ ఒకే రకమైన చర్చ జరుగుతోంది.

  కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ప్రకటిస్తే.. ఆ పార్టీ ద్వారానే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా ? లేక టీఆర్ఎస్ పేరుతోనే మునుగోడు ఉప పోరులో ఉంటామా ? అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే టీఆర్ఎస్ కొత్త పార్టీ పేరుతో మునుగోడు ఉప ఎన్నికలకు వెళ్లాలని అనుకున్నా.. అందుకు సంబంధించి ఈసీ దగ్గర నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉందని సమాచారం. దీంతో కేసీఆర్ ఏ విధమైన వ్యూహంతో ముందుకు సాగుతారనే అంశం ఆసక్తి రేపుతోంది.

  KCR: దసరా రోజు మీటింగ్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేసీఆర్.. మునుగోడు షెడ్యూల్ నేపథ్యంలో..

  Munugodu Bypoll: మునుగోడు ఎవరిది? టీఆర్ఎస్, కాంగ్రెస్ , బీజేపీకి డూ ఆర్ డై వార్

  అయితే టీఆర్ఎస్ జాతీయ పార్టీ సక్సెస్ కావాలంటే.. ముందుగా ఆ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అవసరం చాలా ఉంటుంది. లేకపోతే సొంత రాష్ట్రంలో విజయం సాధించలేకపోయిన టీఆర్ఎస్.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా విజయం సాధిస్తుందనే చర్చ మొదలవుతుంది. విపక్షాలకు ఇది పెద్ద అస్త్రంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికకు ముందు జాతీయ పార్టీపై ప్రకటన చేయనున్న కేసీఆర్.. ఈ ఉప ఎన్నికను ఏ విధంగా ఎదుర్కొబోతున్నారన్నది కూడా ఉత్కంఠగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Munugodu, Munugodu By Election, Telangana

  ఉత్తమ కథలు