Home /News /telangana /

TS POLITICS WILL TRS CONSIDER CONGRESS PARTY ALLEGATIONS AND COUNTERS AFTER RAHUL GANDHI TOUR IN TELANGANA AK

Telangana| Rahul Gandhi: రాహుల్ గాంధీ రాకతో కాంగ్రెస్ అనుకున్నది జరుగుతుందా ?.. టీఆర్ఎస్‌ పట్టించుకుంటుందా ?

కేసీఆర్, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

కేసీఆర్, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

Rahul Gandhi: రాహుల్ గాంధీ పర్యటన ద్వారా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వస్తుందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది.

    కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ రేపటి నుంచి తెలంగాణలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్ గాంధీ... ఆ తరువాత రోజు ఓయూలో విద్యార్థులతో ముఖాముఖి అయ్యేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి దిశానిర్ధేశం చేయనున్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు మెరుగుపడుతుంది ? ఆయన రాకతో కాంగ్రెస్‌కు ఏ మేరకు జోష్ వస్తుందన్నది ? ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే అసలు రాహుల్ గాంధీ రాకతో తెలంగాణలో ఏం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారనే దానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

    రాహుల్ గాంధీ పర్యటన ద్వారా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వస్తుందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. అయితే అంతకంటే ఎక్కువగా రాహుల్ గాంధీ పర్యటన ద్వారా రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ తమను పట్టించుకుంటుందని.. బీజేపీతో(BJP) సమానంగా తమను కూడా టార్గెట్ చేయడం మొదలుపెడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో బలపడుతున్న బీజేపీనే అధికార టీఆర్ఎస్(TRS) కొంతకాలంగా టార్గెట్ చేస్తోంది. బీజేపీ జాతీయ నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

    ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతల విమర్శలను, వారి ఆందోళనలను పట్టించుకోవడం లేదు. వారి విమర్శలు, ఆరోపణలకు టీఆర్ఎస్ నుంచి స్పందన కూడా రావడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందనే ఉద్దేశ్యంతోనే టీఆర్ఎస్ ఇలా చేస్తోందని పలువురు భావిస్తుంటే.. కాంగ్రెస్‌ను పట్టించుకోకుండా లైట్ తీసుకోవడం టీఆర్ఎస్ వ్యూహంలో భాగమే అని మరికొందరు చర్చించుకుంటున్నారు. అయితే అధికార పార్టీ తాము చేసే విమర్శలకు స్పందించకపోవడం వల్ల కాంగ్రెస్‌ కూడా ఇబ్బందిపడుతోంది.

    TS Politics: తెలంగాణ మాజీమంత్రి మళ్లీ డైలమాలో పడిపోయారా ? ఎటూ తేల్చుకోలేకపోతున్నారా ?

    Telangana: బండి సంజయ్‌తో మాజీ ఎంపీ భేటీ ? కాషాయ కండువా కప్పుకుంటారా ?

    రాష్ట్రంలో రాజకీయాలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగితే.. అది భవిష్యత్తులో తమకు ఇబ్బందిగా మారుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన తరువాత మరోసారి తమ పార్టీ పుంజుకుంటుందని.. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో సమానంగా తమపై విమర్శలు చేయడంతో పాటు తాము చేసే విమర్శలకు స్పందిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి.. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ద్వారా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, శ్రేణులు ఆశించిన ఫలితాలు వస్తాయేమో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు