Home /News /telangana /

TS POLITICS WILL TRS CM KCR GO FOR EARLY TELANGANA ASSEMBLY ELECTIONS INSTEAD OF FACING MUNUGODE BYPOLL AMID BJP RAISE HERE IS WHY MKS

CM KCR : అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు? -మునుగోడు బైపోల్ కంటే అదే బెటరా?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

మునుగోడుతో ఉప ఎన్నికల పరంపర ఆగబోదని, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జంపైతే పార్లమెంట్ స్థానానికీ ఉప పోరు తప్పదని, 12 బై ఎలక్షన్స్ వస్తాయన్న బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్ఎస్ ముందస్తు వ్యూహాన్ని అమలు చేయనుందనే అంచనాలున్నాయి..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Nalgonda
మునుగోడు (Munugodu) ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత తెలంగాణ (Telangana)లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తమ్ముడి బాటలోనే అన్న వెంకటరెడ్డీ వెళితే భువనగరి పార్లమెంట్ స్థానంలోనూ బైపోల్ రావచ్చనే అంచనాలున్నాయి. మరోవైపు, టీబీజేపీ చీఫ్ బండి సంజయ్.. కనీసం 12 ఉప ఎన్నికలు రావడం ఖాయమని చెబుతున్నారు. ఉప ఎన్నికలు వచ్చిన, రాబోయే స్థానాల్లో అధికార టీఆర్ఎస్ సీట్లు ఎన్నుంటాయనేది పక్కన పెడితే.. వాటిలో ఏ కొన్ని ఓడినా 2023 సాధరణ ఎన్నికల సినారియో మారుతుందనే అభిప్రాయం వెలువడుతోంది. అసలు బలంగా లేని మునుగోడులో బైమిస్టేక్ బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ వ్యతిరేక ఊపు ముమ్మరం అవుతుందని గులాబీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వరుస ఉప ఎన్నికల కంటే ఒకే సారి ముందస్తుకు వెళితే ఎలా ఉంటుందనే దిశగా టీఆర్ఎస్ అధిష్టానం యోచిస్తున్నట్లు మీడియాలో రిపోర్టులు వస్తున్నాయి..

మునుగోడు ఉప ఎన్నికల కంటే ముందే మొత్తం అసెంబ్లీని రద్దు చేసేస్తే? ముందస్తు ఎన్నికలకు వెళ్తే? టీఆర్‌ఎస్ లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోందని, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలైతే... బీజేపీ చేతిలో ఓడిపోతే... ఇక రాష్ట్రవ్యాప్తంగా సంచలన పరిణామాలు, భారీగా వలసలకు అది కారణమవుతుందని, దాంతో రాజకీయ వాతావరణమే మారిపోతుందని, దాన్ని నివారించేదుకు టీఆర్ఎస్ ముందస్తు అస్త్రాన్ని ప్రయోగించే దిశగా సమాలోచనలు జరుపుతోందని, అందుకోసం అసెంబ్లీ రద్దు దిశగానూ చర్చోపచర్చలు జరుగుతున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.

Munugode Bypoll : మునుగోడుకు భారీగా నిధులు.. అమల్లోకి CM KCR హామీలు.. కోమటిరెడ్డి కోరిందే?


సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా సాగిన హుజూరాబాద్‌ కంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అనివార్యమైన మునుగోడు ఉప ఎన్నికపైనే బీజేపీ అధినాయకత్వం సీరియ్‌సగా దృష్టి పెట్టిందని, ఇదులోగానీ పొరపాటున ఓడితే ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో ఫలితాలు ఎలాగైనా ఉండొచ్చని, కాబట్టి మునుగోడు ఉప ఎన్నికలనే సెమీ ఫైనల్‌ను ఆడకుండా నేరుగా ఫైనల్‌కు వెళ్లిపోతే బాగుంటుందనే ఆలోచన టీఆర్ఎస్ కనిపిస్తోందని కథనంలో పేర్కొన్నారు.

Gold Silver Rates : భారీగా పెరిగి బంగారం, వెండి ధరలు.. రూ.53వేలు దాటిన పసిడి రేటు..


నిజానికి ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ గత నెలలలో కేంద్రానికి సంచలన సవాలు విసిరారు. దమ్ముంటే బీజేపీ ఎన్నికల తేదీని ప్రకటిస్తే, తాను అసెంబ్లీ రద్దు చేస్తానని సీఎం వ్యాఖ్యానించడం తెలిసిందే. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో అదే ముందస్తు ప్రతిపాదనపై ఆ పార్టీలో తాజా చర్చకు తెర లేచిందని సమాచారం. మునుగోడు ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై మాత్రం సీఎం నేరుగా ఎక్కడా మాట్లాడలేదు.మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మరికొన్ని ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రె్‌సకు రాజీనామా చేస్తే... ఏకంగా ఎంపీ స్థానానికే ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని, బండి సంజయ్ జోస్యం ప్రకారమైతే రాష్ట్రంలో మరో 12 ఉప ఎన్నికలుంటాయని, వాటిలో ఏ కొన్నింటిలో ఓడినా టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులకు ఊతం లభించినట్లవుతుందని, ఈ నేపథ్యంలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న గతకాలపు ఆలోచనను వర్తమానంలోకి తేవాలన్న వాదన టీఆర్‌ఎస్‌ నేతల్లో వినిపిస్తోందని కథనంలో పేర్కొన్నారు. ముందస్తుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Congress, Munugodu By Election, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు