హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu By Elections: మునుగోడులో టీఆర్​ఎస్​కు అదే ప్లస్ కానుందా? గులాబీ బాస్​ అలా చెక్​ పెట్టనున్నారా?

Munugodu By Elections: మునుగోడులో టీఆర్​ఎస్​కు అదే ప్లస్ కానుందా? గులాబీ బాస్​ అలా చెక్​ పెట్టనున్నారా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మునుగోడు బై ఎలక్షన్​. ఇది కేవలం ఉపఎన్నిక మాత్రమే కాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పునకు రెఫరెండంగా రాజకీయ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    మునుగోడు (Munugodu). గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న నియోజకవర్గం. కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి రాజీనామాతో అక్కడ మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఇది కేవలం ఉప ఎన్నిక (Munugodu By Elections) మాత్రమే కాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పునకు రెఫరెండంగా రాజకీయ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి. గత నెలలో జరిగిన సీఎం కేసీఆర్ మీటింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన, రేవంత్ రెడ్డి ప్రచారం..  జేపీ నడ్డా బహిరంగ సభ, సెప్టెంబర్​ 17న మునుగోడుపై అమిత్​ షా దిశా నిర్ధేశం ఇలా ప్రధాన పార్టీల నేతలందరూ మునుగోడు వైపే చూస్తున్నారు. ఇప్పటికే వలసలతో అక్కడ రాజకీయ వేడి రాజుకుంది. మునుగోడు నియోజకవర్గంలో గెలిచేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న TRS మునుగోడుపై (Munugodu By Elections)  ఎలాంటి వైఖరి తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. పెండింగ్ ప్రాజెక్టులు, హామీలపై దృష్టి సారిస్తే టీఆర్ఎస్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణాల నుంచి అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనుల వరకు టీఆర్ఎస్ ఫోకస్ చేయాల్సి ఉంది. లేదంటే ఉపఎన్నికల్లో ఎదురీదేందుకు సిద్ధంగా ఉండాలి.

    క్రాస్​ ఓటింగ్​ కీలకం..

    ఇక రాజకీయాల్లో అతి ముఖ్యమైన ఘట్టం అసంతృప్తులకు గాలం. ఇప్పటికే కాంగ్రెస్​ పార్టీ అసంతృప్తులతో నిండిపోయింది. మునుగోడులో (Munugodu By Elections) ప్రస్తుతం కాంగ్రెస్​ తరఫున నలుగురు పార్టీ టికెట్​ ఆశించారు. వారిలో పాల్వాయి స్రవంతి (Palvai Sravanthi), రవికుమార్​, కైలాష్​ నేత, కృష్ణారెడ్డిలు. ఇందులో ఏ ఒక్కరికి టికెట్​ దక్కినా మిగిలిన ముగ్గురి మద్దతు ఉండబోదనే వాదన అక్కడి రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఒకవేళ ఆ అభ్యర్థి గెలిస్తే తరువాత ఎన్నికల్లో తమకు టికెట్​ రాదనే భయం ఆ మిగిలిన ముగ్గురు నాయకుల్లో ఉండటమే దానికి కారణం.

    అయితే ఇప్పటికే అక్కడి కాంగ్రెస్ టికెట్​ను పాల్వాయి స్రవంతి ఇచ్చారు. మిగతా నేతలను కాంగ్రెస్​ సీనియర్​ నేతలు బుజ్జగించారు. అయిత ఇది ఎంత వరకు ఫలితం ఇస్తుందనది తెలియదు. సమయానికి వాళ్లు ఎదురుతిరిగినా ఆశ్చర్య పోనక్కర్లదు. ఇది క్రాస్​ ఓటింగ్​కు (Cross Voting) అవకాశం ఇస్తుంది. ఈ అవకాశాన్ని టీఆర్​ఎస్ బాస్​ (CM KCR)​ తనకు అనుకూలంగా మార్చుకుంటే లాభమే.  ఆ ఓట్లు టీఆర్​ఎస్​కు బదిలీ చేసుకుంటే విజయావకాశాలు మెండుగా ఉంటాయి. ఈ క్రాస్​ ఓటింగ్​ ద్వారా గులాబీ దళం లాభపడే అవకాశాలు ఉంటాయి. ఇది టీఆర్​ఎస్​కు వరం లాంటిద.

    ఇక ఇప్పటికే సీపీఐ మద్దతు ఉండటం టీఆర్​ఎస్​కు కలిసొచ్చే అంశం. మునుగోడులో కమ్యూనిస్టు పార్టీలకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. ఏళ్లుగా ఆ పార్టీ కోసమే పనిచేసే నాయకులు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కువగానే ఉన్నారు. ఇది TRS విజయావకాశాలను పెంచుతుంది. ఇక ఇదే కోవలో బీజేపీకి మద్దతు తెలిపే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి వర్గీయులపై టీఆర్​ఎస్​ ఫోకస్​ పెడుతున్నట్లు టాక్​. ఆయన దగ్గర ఏళ్లుగా అసంతృప్తులుగా ఉన్న నాయకులను టీఆర్​ఎస్​ మచ్చిక చేసుకున పనిలో ఉంది.

    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Kcr, Komatireddy rajagopal reddy, Munugodu By Election, Telangana bjp, Trs, TS Congress

    ఉత్తమ కథలు