కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కోవడం ఓ పెద్ద సవాల్‌గా మారింది. అయితే ఆ సవాల్‌ను స్వీకరించే విషయంలో అనుకున్న దానికంటే ముందుగానే రెడీ అయిపోయింది హస్తం పార్టీ. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందడానికి ముందే మునుగోడు ఎన్నికల రణక్షేత్రంలోకి దిగి పోరాటం మొదలుపెట్టింది. ఇక కాంగ్రెస్ చేస్తున్న ఈ పోరాటానికి రాజగోపాల్ రెడ్డి సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉంటారనే విషయం కూడా తేలిపోయింది. మిగతా కాంగ్రెస్ నేతలు మాత్రం మునుగోడులో విజయం కాంగ్రెస్ పార్టీదే అంటూ ప్రకటనలు చేస్తున్నారు. శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వంటి వాళ్లు కూడా మీడియా ముందుకు వచ్చి.. మునుగోడులో తమ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు.
అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ తరహాలోనే రేవంత్ రెడ్డి అంటే అస్సలు పడని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం ఇప్పటివరకు నోరు మెదపడం లేదు. మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారం మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ నేతలంతా రంగంలోకి దిగి అక్కడ పార్టీ గెలుపు కోసం పని చేస్తుంటే.. జగ్గారెడ్డి మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉండిపోవడం పార్టీలో కొత్త చర్చకు కారణమవుతోంది. కనీసం కర్టసీ కోసమైనా.. ఆయన బయటకు వచ్చి మునుగోడులో కాంగ్రెస్ గెలుస్తుందని ప్రకటించలేదు. దీంతో ఆయన మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ తరపున పని చేసేందుకు జగ్గారెడ్డి సుముఖంగా లేరేమో అనే టాక్ మొదలైంది.
అయితే కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన జగ్గారెడ్డి.. దసరా వరకు తానేమీ మాట్లాడబోనని.. అప్పుడే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. అన్నట్టుగానే ఆయన కొన్ని రోజుల నుంచి కేవలం తన నియోజకవర్గమైన సంగారెడ్డికి పరిమితమవుతున్నారు. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. జగ్గారెడ్డి కూడా కీలక నిర్ణయం తీసుకుంటారా ? అనే చర్చ మొదలైంది.
Komatireddy Rajgopal Reddy: ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజీనామా..మునుగోడు అభివృద్ధి కోసమేనని కామెంట్
CM KCR | I-Day : నేటి నుంచి స్వాతంత్య్ర వజ్రోత్సవాలు.. 2వారాల షెడ్యూల్ ఇదే: సీఎం కేసీఆర్
తెలంగాణలో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనపర్చాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్న బీజేపీ.. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీద ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రయోగిస్తుందేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. జగ్గారెడ్డి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. ఆయన కూడా కచ్చితంగా పార్టీ మారాలని అనుకుంటే.. తెలంగాణలో రాజకీయ పరిణామాలు మరింతగా మారే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉంటున్న జగ్గారెడ్డి ఏ క్షణంలో అయినా మళ్లీ బాంబు పేల్చే అవకాశం లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Jagga Reddy, Telangana