Home /News /telangana /

TS POLITICS WILL TELANGANA CONGRESS AGAIN DISCUSS ON REVANTH REDDY COMMENTS ON REDDY CASTE IN NAVA SANKALP SHIVIR AK

T Congress: రేవంత్ ‘రెడ్డి’పై మళ్లీ చర్చ జరుగుతుందా ?.. మళ్లీ ఆయనే దిక్కవుతారా ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే.. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం, అర్థం మారిపోతాయని కొందరు నేతలు భావిస్తున్నారు.

    తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్న కాంగ్రెస్‌ను వివాదాలు వీడటం లేదు. కొద్దిరోజుల క్రితం ఆ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన పలు వ్యాఖ్యలపై రాజకీయవర్గాలతో పాటు కాంగ్రెస్ వర్గాల్లోనూ హాట్ హాట్‌గా చర్చ జరిగింది. రెడ్డిలకు రాజ్యాధికారం వస్తేనే అంతా బాగుంటుందన్నట్టుగా రేవంత్ రెడ్డి (Revanth Reddy)  చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లోని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై బాహాటంగానే తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ ఎపిసోడ్ దాదాపుగా ముగిసిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నవ సంకల్ప్ శిబిర్ పేరుతో రెండు రోజుల పాటు సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల్లోకి పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై చర్చించేందుకు నాయకులు సమాయత్తమవుతున్నారు. ఇందుకోసం కమిటీలను ఏర్పాటు చేసుకుని అంశాలు కూడా ఖరారు చేసుకున్నారు.

    అయితే ఈ రెండు రోజుల కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేతలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చర్చ లేవనెత్తే అవకాశం లేకపోలేదనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరుకావడం లేదు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న రేవంత్ రెడ్డి.. ఈ సమావేశాలకు దూరంగా ఉండనున్నారు. ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటంతో.. ఆయన చేసిన వ్యాఖ్యలను లేవనెత్తేందుకు, దానిపై చర్చ జరగాలని పట్టుబట్టేందుకు అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

    మరోవైపు ఈ వ్యవహారంపై కొందరు నేతలు చర్చకు తెరలేపే అవకాశం ఉండటంతో.. సీనియర్ నేతలు కొందరు దీనిపై ఎలాంటి చర్చ జరగకుండా చూడాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా అనేక అంశాల్లో రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్న సీనియర్ నేత జానారెడ్డి (Janareddy) ఈ విషయంలో అనవసర రచ్చ జరగకుండా చూడాలని ఇప్పటికే పార్టీ నేతలకు సూచించారని.. ఒకవేళ ఎవరైనా ఈ అంశాన్ని లేవనెత్తినా.. దానిపై పెద్దగా మాట్లాడవద్దని చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి.

    CM KCR | Centre : తెలంగాణలో ఆర్థిక సంక్షోభం? -జీతాలు, పథకాలకు నిధులు కటకట -చేబదుళ్లు, ఓడీపై దృష్టి!

    KCR| NTR: ఎన్టీఆర్ విషయంలో టీఆర్ఎస్ లెక్కలు అలా ఉన్నాయా ? కేసీఆర్ అంతదూరం ఆలోచిస్తున్నారా ?

    ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే.. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం, అర్థం మారిపోతాయని కొందరు నేతలు భావిస్తున్నారు. అయితే కొందరు బీసీ నేతలు మాత్రం రేవంత్ రెడ్డి చేసిన ఈ రకమైన వ్యాఖ్యల కారణంగా పార్టీకి చేరువ కావాల్సిన బీసీలు దూరమయ్యే అవకాశం ఉందని అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న కాంగ్రెస్ నవ సంకల్ప్ శిబిర్‌లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎలాంటి చర్చ జరగకపోతే.. ఇక ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వివాదం పూర్తిగా సమసిపోయినట్టే భావించాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Revanth Reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు