Home /News /telangana /

TS POLITICS WILL TELANGANA CM KCR TO COUNTER BJP WITH HIS NATIONAL PARTY IN A DIFFERENT WAY AK

KCR New Strategy: జాతీయ పార్టీపై కేసీఆర్ లెక్కేంటి ?... బీజేపీకి అలా కౌంటర్ ఇస్తారా ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR Plan: తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బలపడుతోంది. కాంగ్రెస్ కూడా అదే పనిలో నిమగ్నమైంది. దీంతో ఈసారి టీఆర్ఎస్ గతంతో పోల్చితే మరింత బలమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది.

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ స్థాయిలో విస్తరించాలని ఆయన యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కేసీఆర్(CM KCR) సారథ్యంలోని పార్టీని ఇతర రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తారా ? ముందుగా అక్కడి రాజకీయ పార్టీలు కేసీఆర్‌ నేతృత్వంలోని పార్టీని తమ తమ రాష్ట్రాల్లో నిలదొక్కుకునేలా చేస్తాయా ? అన్నది ప్రశ్నార్థకమే. అయితే అసలు కేసీఆర్ వేస్తున్న కొత్త ఎత్తుగడ వెనుక అసలు వ్యూహం ఏంటన్న దానిపై అనేక రకాలుగా చర్చ జరుగుతోంది.

    తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బలపడుతోంది. కాంగ్రెస్(Congress) కూడా అదే పనిలో నిమగ్నమైంది. దీంతో ఈసారి టీఆర్ఎస్(Trs) గతంతో పోల్చితే మరింత బలమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో మాదిరిగా తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి ప్రయోగించి సక్సెస్ సాధించే అవకాశాలు పెద్దగా లేవని కేసీఆర్ అంచనాకు వచ్చారని.. అందుకే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు తన పార్టీని జాతీయ పార్టీగా మార్చాననే నినాదాన్ని తెలంగాణ జనంలోకి పెద్ద ఎత్తున తీసుకెళతారని పలువురు అంచనా వేస్తున్నారు.



    ఈ క్రమంలోనే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి ముందుగా తెలంగాణలో ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారనే వాదన కూడా ఉంది. తాను పెట్టిన జాతీయ పార్టీని తెలంగాణలోనే ఆదరించకుంటే దేశంలో ఎలా ఆదరిస్తారనే వాదనను కేసీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం లేకపోలేదని కొందరు చర్చించుకుంటున్నారు. నవ్వేవారి ముందు జారిపడొద్దంటూ కేసీఆర్ అనేకసార్లు తన ప్రసంగంలో చెబుతుంటారు.

    CM KCR | BRS : కేసీఆర్ అనూహ్యం.. ప్రాంతీయ ఫార్ములాతోనే జాతీయ పార్టీ -ఎన్టీఆర్‌, పీవీ బొమ్మలతో..

    CM KCR | Undavalli : కేసీఆర్‌తో ఉండవల్లి ఏం మాట్లాడారు? -ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు వ్యూహాలు!

    ఇదే రకంగా ఆయన తన జాతీయ పార్టీ ముందుగా తెలంగాణలో విజయం సాధించాలని.. అందుకు ప్రజలు సహకరించాలని కోరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు ప్రజలను ఆకర్షించేందుకు సరికొత్త అజెండా అవసరమని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారని.. అందుకే ఆయన ఈ రకమైన ఎత్తుగడ వేసి ఉండొచ్చనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. మొత్తానికి రాజకీయాల్లో ఆరితేరిన సీఎం కేసీఆర్.. మరోసారి ముందస్తు ఎన్నికలు వెళితే.. ఈ వాదనలో ఎంతోకొంత నిజం ఉన్నట్టు భావించే అవకాశం ఉంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, CM KCR, Congress, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు