హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR Vs BJP: బీజేపీ టార్గెట్‌గా కేసీఆర్ పక్కా వ్యూహం.. టీఆర్ఎస్ అధినేత అంచనాలు నిజమవుతాయా ?

KCR Vs BJP: బీజేపీ టార్గెట్‌గా కేసీఆర్ పక్కా వ్యూహం.. టీఆర్ఎస్ అధినేత అంచనాలు నిజమవుతాయా ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR Strategy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. రాష్ట్రంలో కేసీఆర్‌కు ధీటైన పోటీ ఇచ్చే నాయకుడిని బీజేపీ నిలబెట్టడం కష్టం. ప్రధాని నరేంద్రమోదీ ఇమేజ్‌తోనే బీజేపీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (KCR) అనేక రకాలుగా వ్యూహరచన చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని భావిస్తున్న కేసీఆర్.. వాటిని ఎదుర్కొవడం ఎలా అనే అంశంపై చాలాకాలం నుంచి కసరత్తు చేస్తున్నారు. జాతీయస్థాయిలో బీజేపీని(BJP) టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల లోపు బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారా ? లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే తెలంగాణలో బీజేపీని ఎదుర్కొనే విషయంలో సీఎం కేసీఆర్ తనదైన ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారనే చర్చ జరుగుతోంది. తెలంగాణలోని బీజేపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఆయనను టార్గెట్ చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం బీజేపీని, నరేంద్రమోదీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణలోని ముఖ్యనేతలను, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను(Bandi Sanjay) కేసీఆర్ విమర్శించిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి.

అయితే కేసీఆర్ ఇలా చేయడం వెనుక ప్రత్యేకమైన వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. రాష్ట్రంలో కేసీఆర్‌కు ధీటైన పోటీ ఇచ్చే నాయకుడిని బీజేపీ నిలబెట్టడం కష్టం. ప్రధాని నరేంద్రమోదీ ఇమేజ్‌తోనే బీజేపీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఇదే రకమైన వ్యూహంతో ముందుకెళ్లింది. తెలంగాణలోనూ బీజేపీ ఇదే రకమైన ప్లాన్‌తో వెళుతుంది.

ఇదే రకంగా ఎన్నికలు జరిగితే.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపు నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని టీఆర్ఎస్ భావిస్తోంది. కేసీఆర్ కూడా ఇదే అంచనాలతో ముందుకు సాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఇదే జరిగిందని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పరిపాలన వైపు మొగ్గు చూపిన రాష్ట్ర ప్రజలు.. జాతీయస్థాయిలో అత్యంత ప్రభావం కలిగిన నాయకుడైన ప్రధాని మోదీకి అనుకూలంగానే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు సీట్లు కట్టబెట్టారని పలువురు అభిప్రాయపడుతుంటారు.

జగిత్యాల TRS కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్..వైద్య కళాశాలకు భూమి పూజ

Karimnagar: నేడే జగిత్యాలకు సీఎం కెసిఆర్ రాక..పర్యటనను అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకుల పిలుపు

అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీని టార్గెట్ చేయడం వల్ల రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వైపు చూపుతారని టీఆర్ఎస్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ కూడా ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

First published:

Tags: Bjp, Telangana

ఉత్తమ కథలు