మునుగోడు ఉప ఎన్నిక తరువాత తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా మారతాయో అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. పార్టీ నేతలందరినీ మునుగోడులో మొహరించి అక్కడ విజయం సాధించడంలో సక్సెస్ సాధించారు. హోరాహోరీ పోరులో టీఆర్ఎస్(TRS) విజయం సాధించడం.. ఇక్కడ తమ గెలుపు ఖాయమని భావించిన బీజేపీకి భంగపాటు ఎదురుకావడం వంటి పరిణామాలు రాబోయే రోజుల్లో తెలంగాణ(Telangana) రాజకీయాలపై ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈ విజయాన్ని కేసీఆర్(KCR) ఏ రకంగా తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నారనే దానిపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రత్యర్థులకు అంతుచిక్కని రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న కేసీఆర్.. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అయితే ఈసారి కూడా కేసీఆర్ అలాంటి ప్రయోగమే చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. అయితే అలాంటి ఆలోచన తమకు లేదని కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పలుసార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే రాజకీయ నేతల వ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అందులోనూ మునుగోడు వంటి విజయం ఇచ్చి బూస్టింగ్తో కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికల ఆలోచన చేసే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది.
నిజానికి ఈ ఏడాది గుజరాత్ ఎన్నికలతో పాటే తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళతారనే వార్తలు వచ్చాయి. అయితే కర్ణాటక ఎన్నికల సమయంలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగేలా కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసే అవకాశం లేకపోలేదని కొంతకాలం క్రితం ఊహాగానాలు వినిపించాయి. కానీ టీఆర్ఎస్ మాత్రం మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ విషయంలో తొందరపడకూడదనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Munugode Bypoll Result: మునుగోడులో టీఆర్ఎస్ గెలవ లేదు .. గెలిచిన వాళ్ల పేర్లు చెప్పిన బండి సంజయ్
BJP in Munugode : మునుగోడు ఉప ఎన్నికలో ఓడినా బీజేపీకి భారీ లాభం
అయితే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలనే ఆలోచనలో ఉన్న కేసీఆర్.. ముందుగా బీఆర్ఎస్ పేరుతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని.. ఆ ఆ తరువాత జాతీయస్థాయిలో రాజకీయాలపై ఫోకస్ చేసే అవకాశం లేకపోలేదని పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే ఎవరూ ఊహించని విధమైన వ్యూహాలతో ముందుకు సాగే కేసీఆర్ మరోసారి ముందస్తు విషయంలో ముందడుగు వేస్తారా ? లేక ఆ మరో రకమైన ఆలోచనతో బీజేపీని ఎదుర్కుంటారా ? అన్నది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.