హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| Telangana: అంతుచిక్కని కేసీఆర్ కొత్త ప్లాన్.. అలాంటి ఆలోచనతో ఉన్నారా ?

KCR| Telangana: అంతుచిక్కని కేసీఆర్ కొత్త ప్లాన్.. అలాంటి ఆలోచనతో ఉన్నారా ?

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR: తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ప్రజలను మెప్పించే విధంగా ఉండే కారణం కోసం కేసీఆర్ అన్వేషిస్తున్నారని.. కాబట్టి ఈ రకమైన కారణంతో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది.

  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త విధానం ఎవరికీ అంతుచిక్కడం లేదు. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో కలిసి దేశంలో కొత్త కూటమి ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నించిన కేసీఆర్.. ఇప్పుడు కూటములు కాదు ప్రత్యామ్నాయ ఎజెండా అనే నినాదాన్ని వినిపించారు. మిగతా పార్టీలతో కలవకుండా జాతీయ రాజకీయాల్లో రాణించడం అంత సులువుకాదు. కానీ కేసీఆర్ ఎందుకు ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు. అసలు తన ప్రత్యామ్నాయ ఎజెండాతో కేసీఆర్ దేశ ప్రజలను ఏ విధంగా తనవైపు తిప్పుకుంటారనే విషయంలోనూ ఎవరికీ క్లారిటీ లేదు. అయితే కేసీఆర్ (CM KCR) వ్యూహాలు ఎవరికీ అర్థంకాదు. ఆయన ఏ వ్యూహంతో ఈ సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారో కూడా ఎవరికీ అంతుచిక్కడం లేదు.

  అయితే గులాబీ బాస్ ప్రకటన వెనుక ఆయన ప్లాన్ వేరే ఉండొచ్చనే విశ్లేషణలు మాత్రం వినిపిస్తున్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే.. కచ్చితంగా ఇక్కడ తన సీఎం పీఠాన్ని మరొకరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన తన కుమారుడు కేటీఆర్‌ను(KTR) సీఎం చేయాలనే ఆలోచనతో ఉన్నారనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. కేవలం కొన్ని నెలల కోసం తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి బదులుగా మరోసారి టీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి కుమారుడిని సీఎం చేయాలనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నారనే చర్చ సాగుతోంది.

  త్వరలోనే అనేక మంది మేథావులు, విద్యావేత్తలతో సదస్సు నిర్వహించి దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఎజెండా రూపొందిస్తామని కేసీఆర్ తెలిపారు. అయితే దేశం కోసం బయలుదేరడానికి ముందు తెలంగాణలో (Telangana) మరోసారి తనకు బలం ఉందని నిరూపించేందుకు కేసీఆర్ కచ్చితంగా ప్రయత్నిస్తారని.. ఇందుకోసం రాష్ట్రంలో మరోసారి ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

  TRS Assets: ఇవీ టీఆర్ఎస్ ఆస్తులు, నిధులు లిస్ట్.. బయటపెట్టిన సీఎం కేసీఆర్

  KCR| Telangana: కేసీఆర్ మాటలకు అర్థమేంటి ? ఇకపై అలాంటి పర్యటనలు ఉండవా ?

  తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ప్రజలను మెప్పించే విధంగా ఉండే కారణం కోసం కేసీఆర్ అన్వేషిస్తున్నారని.. కాబట్టి ఈ రకమైన కారణంతో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే ఏడాది తొలి సగంలోపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల సమయాలను బేరీజు వేసుకుని తన అనుకూలతల ఆధారంగా ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదని రాజకీయవర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయవ్యూహాల్లో ఆరితేరిన కేసీఆర్ ఆలోచన అంత తొందరగా బయటపడవనే టాక్ కూడా ఉంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు