హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| Telangana: కేసీఆర్ మాటలకు అర్థమేంటి ? ఇకపై అలాంటి పర్యటనలు ఉండవా ?

KCR| Telangana: కేసీఆర్ మాటలకు అర్థమేంటి ? ఇకపై అలాంటి పర్యటనలు ఉండవా ?

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

KCR: కేసీఆర్ మాత్రం ప్రత్యామ్నాయ కూటమికి బదులుగా ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు.

  తెలంగాణ సీఎం కేసీఆర్ చేసే వ్యాఖ్యల్లో ఎంతో అర్థం ఉంటుంది. అందుకే ఆయన కామెంట్స్‌ను రాజకీయవర్గాలు ఆసక్తిగా గమనిస్తుంటాయి. కేసీఆర్ చేసే కొన్ని వ్యాఖ్యలు.. ఆయన భవిష్యత్తు కార్యాచారణను సూచిస్తుంటాయి. తాజాగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొంతకాలంగా దేశంలోని పలు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, పార్టీలను కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక గురించి కేసీఆర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమికి కేసీఆర్ (KCR) శ్రీకారం చూడతారని అంతా భావించారు. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పైచేయి సాధించడంతో కేసీఆర్ ఆశలు, ప్రయత్నాలు ఫలించలేదనే వాదన మొదలైంది. తాజాగా పార్టీ ఆవిర్భావ సదస్సులో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

  దేశంలో అద్భుత‌మైన ప్రత్యామ్నాయ ఎజెండాతో, కొత్త రాజ‌కీయ శ‌క్తి ఈ దేశంలో ఆవిర్భవించాలని.. తెలంగాణ కోసం టీఆర్ఎస్ (TRS) పుట్టినట్లే దేశం కోసం ఒక శక్తి తప్పకుండా పుడుతుందని అన్నారు. దేశ రాజ‌కీయాల‌ను ప్రభావితం చేయ‌డానికి హైద‌రాబాద్ (Hyderabad)  వేదిక‌గా కొత్త ఎజెండా, ప్రతిపాదన, సిద్ధాంతం త‌యారై దేశం న‌లుమూల‌ల వ్యాపిస్తే ఈ దేశానికే గ‌ర్వకారణంగా ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజ‌కీయ గుంపు, కూటమి కాకుండా ప్రత్యామ్నాయ ఎజెండా ఈ దేశానికి కావాలని అన్నారు.

  అయితే కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి ఇకపై ఆయన దేశంలోని కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను కలవడం, వారితో చర్చలు జరపడం వంటి ఆలోచనలు చేయడం లేదనే వాదన మొదలైంది. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమికి బదులుగా ప్రత్యామ్నాయ ఎజెండా కావాలన్న కేసీఆర్.. ఆ దిశగా ఎలా ముందుకు వెళతామనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తెలంగాణలోని రాజకీయ పార్టీ ద్వారా రూపొందించిన ఎజెండాను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆకర్షించేలా చేయడం అంత సులభం కాదనే విషయం కేసీఆర్‌కు తెలియనిది కాదు.

  KTR| TRS Plenary: కేసీఆర్ లాంటి నేత దేశానికి అవసరం.. ప్లీనరీలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

  KCR | TRS plenary: కేసీఆర్ సంచలనం.. జాతీయ అజెండా ప్రకటన.. భారత రాష్ట్ర సమితి (BRS)!

  కానీ కేసీఆర్ మాత్రం ప్రత్యామ్నాయ కూటమికి బదులుగా ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలో బలంగా ఉన్న పార్టీలను కాదని.. సొంతంగా ఎజెండాను ఖరారు చేసుకుని మందుకు సాగే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దేశంలోని ఇతర పార్టీలతో కలిసి చర్చలు జరిపే ఆలోచనకు స్వస్తి చెప్పడంతో పాటు పొలిటికల్ టూర్లు ఉండబోవని చెప్పకనే చెప్పారని కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి కొత్త కూటమికి బదులుగా కొత్త ఎజెండా అనే వాదనను తెరపైకి తీసుకొచ్చిన కేసీఆర్.. ఇందుకు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు