Home /News /telangana /

TS POLITICS WILL TELANGANA CM KCR ENTER INTO MUNUGODU BEFORE AMIT SHAH MEETING ON AUGUST 21 HERE IS THE DETAILS AK

KCR| Amit Shah: మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభ.. అమిత్ షా కంటే ముందుగానే రంగంలోకి కేసీఆర్ ?

కేసీఆర్, అమిత్ షా (పైల్ ఫోటో)

కేసీఆర్, అమిత్ షా (పైల్ ఫోటో)

KCR| Munugodu: కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతుండటం.. బీజేపీ కూడా పక్కా ప్లాన్‌తో ఉప ఎన్నికల బరిలోకి దిగబోతుండటంతో.. టీఆర్ఎస్ కూడా అంతే పక్కా ప్లాన్‌తో ఈ ఉప ఎన్నికను ఎదుర్కోవాలని భావిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు(Munugodu) ఉప ఎన్నిక ఎంతో కీలకంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా బీజేపీకి అడ్డుకట్ట వేయొచ్చని టీఆర్ఎస్.. తాము గెలవడం ద్వారా టీఆర్ఎస్‌కు మరింతగా దెబ్బకొట్టవచ్చని బీజేపీ.. తమ సిట్టింగ్ సీటును నిలుపుకోవడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో తాము కూడా ప్రధాన పోటీదారు అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ నెల 21న చౌటుప్పల్‌లో (Choutuppal) ఏర్పాటు చేయబోయే భారీ బహిరంగ సభ ద్వారా బీజేపీ ముఖ్యనేత అమిత్ షా సమక్షంలోనే బీజేపీలో చేరాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy)భావిస్తున్నాయి. ఆయనతో పాటు అనేక మంది నేతలు ఆ రోజు అమిత్ షా సమక్షంలో బీజేపీ(BJP) కండువా కప్పుకుంటారని బీజేపీ నేతలు చెబుతున్నాయి.

    అయితే మునుగోడు ఉప ఎన్నిక కోసం అమిత్ షా రంగంలోకి దిగడానికి ముందుగానే.. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారనే చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికను ఎంతో సీరియస్‌గా తీసుకోవాలని భావిస్తున్న టీఆర్ఎస్.. అక్కడ బీజేపీకి ధీటుగా ఎన్నికల ప్రచారం చేపట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ షా సభ కంటే ముందుగానే మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మునుగోడులో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేపడుతోంది.



    స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మండలాల వారీగా ఆయన పాదయాత్ర కూడా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అభ్యర్థి ఎంపికతో నిమిత్తం లేకుండా నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం నిర్వహించాలని రేవంత్ రెడ్డి డిసైడయ్యారు. ఆ దిశగానే వేగంగా దూసుకుపోతున్నారు.

    Munugodu| Congress: మునుగోడుపై కాంగ్రెస్‌లో కొత్త డిమాండ్.. వారికే టికెట్ ఇవ్వాలంటూ..

    Congress| TRS: కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు సరికొత్త టెన్షన్.. మునుగోడు బరిలో ఆ పార్టీ ?

    కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో దూకుడుగా ముందుకు సాగుతుండటం.. బీజేపీ కూడా పక్కా ప్లాన్‌తో ఉప ఎన్నికల బరిలోకి దిగబోతుండటంతో.. టీఆర్ఎస్ కూడా అంతే పక్కా ప్లాన్‌తో ఈ ఉప ఎన్నికను ఎదుర్కోవాలని భావిస్తోంది. అందుకే బీజేపీ ముఖ్యనేత అమిత్ షా హాజరుకాబోయే 21వ తేదీ సభ కంటే ముందుగానే అక్కడ టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికను అమిత్ షా సీరియస్‌గా తీసుకుంటున్నారనే టాక్ నేపథ్యంలో కేసీఆర్ కూడా మునుగోడుపై అంతే స్థాయిలో దృష్టి పెట్టారనే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amit Shah, CM KCR, Munugodu By Election

    తదుపరి వార్తలు