హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| Dussera: టీఆర్ఎస్‌కు కీలకంగా మారిన దసరా.. ఆ రోజే కేసీఆర్ సంచలన ప్రకటన ?

KCR| Dussera: టీఆర్ఎస్‌కు కీలకంగా మారిన దసరా.. ఆ రోజే కేసీఆర్ సంచలన ప్రకటన ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR: దసరా రోజున కేసీఆర్ ఈ సస్పెన్స్‌కు తెరదించుతారా ? లేక మరికొంతకాలం వేచి చూసే ధోరణిని అవలంభిస్తారా ? అని కొందరు చర్చించుకుంటున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల కోసం తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే సిద్ధం చేసుకున్న వ్యూహాలను అమలు చేస్తున్నాయి. తెలంగాణలో(Telangana) తమ నుంచి అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) తనదైన శైలిలో ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తున్న బీజేపీని(BJP) జాతీయస్థాయిలో ఎదుర్కొనేందుకు ఓ జాతీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అనేక పార్టీల నాయకులతో చర్చలు జరిపారు. అయితే కేసీఆర్ వారిలో ఏం చర్చించారనే దానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. అయితే కేసీఆర్ మాత్రం తనదైన వ్యూహాలతో బీజేపీని ఇరుకునపెట్టేందుకు విపక్షాల సాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

  ఈ క్రమంలోనే ఆయ జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఇందుకు ఆయన దసరా రోజునే ముహూర్తంగా ఎంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తన జాతీయ పార్టీ జెండా, ఎజెండాను ఖరారు చేస్తున్న కేసీఆర్ .. దసరా రోజును దాన్ని ప్రకటించి ముందుకు సాగాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌కు దసరా ఎంతో కీలకంగా మారిందనే చర్చ జరుగుతోంది. అయితే కొంతకాలంగా కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కాని అది ఎప్పుడు అనే దానిపై మాత్రం కేసీఆర్ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో దసరా రోజున కేసీఆర్ ఈ సస్పెన్స్‌కు తెరదించుతారా ? లేక మరికొంతకాలం వేచి చూసే ధోరణిని అవలంభిస్తారా ? అని కొందరు చర్చించుకుంటున్నారు.

  మరోవైపు టీఆర్ఎస్‌లోని కొందరు నాయకులు మాత్రం దసరా రోజునే కేసీఆర్ తన జాతీయ పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఒకసారి జాతీయ పార్టీ పేరును ప్రకటించిన తరువాత ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై కూడా కేసీఆర్ ఓ రోడ్ మ్యాప్‌ను రెడీ చేసుకున్నారని.. అందుకు తగ్గట్టుగానే ఆయన కార్యాచరణ ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

  KCR: మునుగోడుపై తేల్చేసిన కేసీఆర్.. ఆ తరువాతే అభ్యర్థి ప్రకటన ?

  BJP: తెలంగాణలో బెంగాల్ ఫార్ములా.. అమిత్ షా వ్యూహం.. రంగంలోకి ప్రత్యేక టీమ్‌లు ?

  అయితే జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్న కేసీఆర్‌కు మునుగోడు ఉప ఎన్నిక అనేది ఓ సవాల్‌గా మారిందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలకు ముందే పార్టీని ప్రకటించాలా ? లేక ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు ఆగాలా ? అనే ప్రశ్న కూడా కేసీఆర్ ఆలోచనలో ఉందని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి దసరా రోజు కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారా ? లేదా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana, Trs

  ఉత్తమ కథలు