ఈ నెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభమవుతుందని తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తరువాత ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో నేతలతో సమాలోచనలు చేసిన కేసీఆర్.. కేంద్రంలో రాబోయేది రైతు ప్రభుత్వమే అని అన్నారు. కర్నాటకలో జేడీఎస్‌కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్పారు. త్వరలోనే పార్టీ పాలసీలు రూపొందిస్తామని వివరించారు. రైతు పాలసీ, జల విధానం రూపొందిస్తామని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తామని అన్నారు. కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు దేశంలో పరివర్తన కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు చేశామని అన్నారు. నాలుగైదు నెలల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ కొత్త కార్యాలయం సిద్ధమవుతుందన్న కేసీఆర్.. ఢిల్లీ ఎర్రకోటపై ఎగరాల్సింది గులాబీ జెండే అని వ్యాఖ్యానించారు.
అంతకుుందు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సీఎం కేసీఆర్ (Cm Kcr), కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సినీ నటుడు ప్రకాష్ రాజ్, పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్లో జరిగిన సమావేశానికి వచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన కేసీఆర్ సరిగ్గా 1.20 నిమిషాలకు ఈసి పంపిన BRS పత్రాలపై సంతకం చేశారు. ఇప్పటివరకు TRS గా ఉన్న పార్టీ ఇకపై BRSగా జాతీయ పార్టీగా అవతరించింది. పత్రాలపై సంతకం చేసిన కేసీఆర్ BRS జెండాను ఆవిష్కరించారు. అయితే BRSగా మారిన కూడా గులాబీ జెండా రంగు కొనసాగించగా..కారు గుర్తు కనిపించలేదు. కేవలం తెలంగాణ మ్యాప్ స్థానంలో భారతదేశాన్ని ఉంచారు.
కాగా 22 ఏళ్ల తెరాస ప్రస్థానం ఇకపై బీఆర్ఎస్ గా కార్యకలాపాలు నిర్వహించనుంది. అయితే మొదటగా BRS టార్గెట్ కర్నాటకగా తెలుస్తుంది. మొదటి నుంచి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ (Cm Kcr) కు మద్దతుగా నిలుస్తున్నారు. ఆ రాష్ట్రంలో కుమారస్వామితో కలిసి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఇప్పటివరకు తెలంగాణకు మాత్రమే పరిమితమైన కేసీఆర్ (Cm Kcr) ఇకపై దేశ వ్యాప్తంగా విస్తరించనుంది. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురితో చర్చలు కూడా జరిపారు.
BRS: బీఆర్ఎస్ కొత్త జెండా, కండువాను చూశారా? అంతా సేమ్.. అదొక్కటే చేంజ్..
అయితే Trs Brs గా మారినప్పటికీ కూడా జెండా రంగు, కారు గుర్తును అలాగే కొనసాగిస్తారని అంతా భావించారు. BRS జెండావిష్కరణ చేసే వరకు కూడా ఈ విషయం పెద్దగా వార్తల్లోకి రాలేదు. కానీ జెండావిష్కరణ తరువాత పార్టీ కండువా, జెండాపై కారు గుర్తు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడీ అంశం తీవ్ర చర్చనీయాంశం అయింది. కేవలం తెలంగాణ మ్యాప్ స్థానంలో భారతదేశాన్ని ఉంచారు. కానీ ఎక్కడా కూడా కారు గుర్తు కనిపించలేదు. BRS గుర్తు మార్చే యోచనలో కేసీఆర్ (Cm Kcr) ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.