హోమ్ /వార్తలు /తెలంగాణ /

Revanth Reddy: రేవంత్ రెడ్డి కొత్త నినాదం.. తెలంగాణ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా ?

Revanth Reddy: రేవంత్ రెడ్డి కొత్త నినాదం.. తెలంగాణ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: తెలంగాణకు సరికొత్త జెండాను, సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. గత రెండు దశాబ్దాలుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్(CM KCR) తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగానే ఎక్కువగా రాజకీయాలు చేశారు. ఆ సెంటిమెంట్‌తోనే ఎక్కువగా సక్సెస్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సీఎం కేసీఆర్ అప్పుడప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారనే వాదన రాజకీయవర్గాల్లో వినిపిస్తుంటుంది. అయితే తాజాగా తెలంగాణ సెంటిమెంట్ అంశానికి సంబంధించిన పలు విషయాలను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ (Congress) ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన తరువాత వాహనాలపై ఉన్న రిజస్ట్రేషన్ కోడ్ TS‌ను TGగా మారుస్తామని ప్రకటించారు.

  అంతేకాదు అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటను (Telangana Song)రాష్ట్ర గీతంగా మారుస్తామని అన్నారు. తెలంగాణకు సరికొత్త జెండాను, సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే రేవంత్ రెడ్డి ఈ రకమైన ప్రకటన చేశారని కొందరంటుంటే.. TS‌ను TGగా మార్చాలనే డిమాండ్‌ను రేవంత్ రెడ్డి గతంలోనూ వినిపించారని పలువురు గుర్తు చేస్తున్నారు. దీనికి అదనంగా ఆయన మరికొన్ని అంశాలను తెలంగాణ సెంటిమెంట్ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.

  నిజానికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ అంశం ఇంకా పని చేస్తుందని చాలామంది అనుకోవడం లేదు. రాష్ట్ర ఏర్పడి తరువాత రెండుసార్లు ఎన్నికలు జరగడంతో.. ఈసారి తెలంగాణ సెంటిమెంట్ కంటే ఎక్కువగా ప్రభుత్వ పనితీరు అంశం మీదే ప్రజలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారనే టాక్ కూడా ఉంది. ఈ కారణంగానే గతంలో విపక్షాలను టార్గెట్ చేసేందుకు ఎక్కువగా తెలంగాణ సెంటిమెంట్ అంశాన్ని వినియోగించుకున్న టీఆర్ఎస్ .. ఇప్పుడు అలా చేయడం లేదనే వాదన ఉంది.

  Etala Rajender : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్‌ అసెంబ్లీ నుంచి సస్పెండ్ ..కారణం ఇదే

  Minister KTR: మంత్రి కేటీఆర్ చొరవ.. ఏళ్ల తరబడి నెలకొన్న సమస్యకు పరిష్కారం.. ప్రజలు హ్యాపీ

  అయితే సమయాన్ని బట్టి కేసీఆర్ తెలంగాణవాదాన్ని మరోసారి తెరపైకి తీసుకొస్తారని.. అందుకే ఆయన కంటే ముందుగానే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రకమైన నినాదాలను సిద్ధం చేసి పెట్టుకున్నారనే వాదన కూడా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ సెంటిమెంట్‌కు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించిన టి కాంగ్రెస్.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా ప్రయోజనం పొందగలుగుతుందా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Revanth Reddy, Telangana

  ఉత్తమ కథలు