Home /News /telangana /

TS POLITICS WILL REVANTH REDDY BEHIND JUPALLY KRISHNA RAO WHO IGNORED TELANGANA MINISTER KTR SUGGESTION AK

KTR: మాజీమంత్రి కేటీఆర్‌ షాక్ ఇచ్చారా ? తెర వెనుక ఆ నేత చక్రం తిప్పుతున్నారా ?

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: జూపల్లి కృష్ణారావు ఈ రకమైన దూకుడును ప్రదర్శించడం వెనుక అసలు కారణం ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి

    తెలంగాణ రాజకీయాలు అప్పుడే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అప్పుడే ఎన్నికల్లో గెలవడం ఎలా అనే దానిపై ముమ్మర కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో నేతలు కూడా ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు, గెలిచేందుకు ఎవరికి తగ్గ ప్లాన్స్ వాళ్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) కూడా వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అప్పుడే గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. కొల్లాపూర్(Kollapur) నుంచి తనకు టీఆర్ఎస్ టికెట్ వస్తే ఒకలా.. లేకపోతే మరో వ్యూహంతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) జూపల్లి కృష్ణారావును కలిసి బుజ్జగించారు. టీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న జూపల్లి పార్టీ మారేందుకు సిద్ధమవుతారని అంతా అనుకున్నారు.

    అయితే కేటీఆర్ రంగంలోకి దిగడంతో.. ఆయన సైలెంట్ అవుతారని.. మళ్లీ టీఆర్ఎస్‌లోనే కంటిన్యూ అవుతారని చాలామంది భావించారు. కానీ కొల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని రాజకీయంగా టార్గెట్ చేసే విషయంలో జూపల్లి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. హర్షవర్ధన్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. దీంతో కొల్లాపూర్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే కేటీఆర్ స్వయంగా ఇంటికి వెళ్లినప్పటికీ.. జూపల్లి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

    అయితే జూపల్లి కృష్ణారావు ఈ రకమైన దూకుడును ప్రదర్శించడం వెనుక అసలు కారణం ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తే పోటీ చేయాలని.. లేకపోతే కాంగ్రెస్ తరపున ఆయనకు టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొల్లాపూర్‌లో గతంలో కాంగ్రెస్ తరపున జూపల్లి కృష్ణారావు పలుసార్లు విజయం సాధించారు. ఆయన బీజేపీలోకి వెళ్లాలని అనుకున్నప్పటికీ.. డీకే అరుణతో ఉన్న రాజకీయ విభేదాల కారణంగా అటు వైపు వెళ్లడానికి ఆయన ఆలోచిస్తున్నారని.. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి చక్రం తిప్పుతున్నారని కొందరు చర్చించుకుంటున్నారు.

    Nalgonda : నకిరేకల్‌లో తారస్థాయికి చేరిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య పంచాయితీ ..నెక్ట్స్ ఎట్లుంటదో

    Rajannasircilla: వేములవాడ రాజన్న గుడిలో సామాన్య భక్తులకు పెద్దపీట .. నూతన ఈవో రాకతో మారిన సిస్టమ్

    కొల్లాపూర్‌లో టీఆర్ఎస్‌ను రాజకీయంగా ఇబ్బందిపెట్టి ఆ తరువాత కాంగ్రెస్‌లోకి రావాలని జూపల్లిని రేవంత్ రెడ్డి కోరారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో అమీతుమీతో సిద్ధమవుతున్నారని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి కేటీఆర్‌కు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు షాక్ ఇవ్వడం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: KTR, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు