హోమ్ /వార్తలు /తెలంగాణ /

PM Modi-YS Sharmila: షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్.. రాజకీయం మారుతోందా ?

PM Modi-YS Sharmila: షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్.. రాజకీయం మారుతోందా ?

వైఎస్ షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్

వైఎస్ షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్

YS Sharmila: తెలంగాణలో రాజకీయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్న షర్మిలకు.. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చే అవకాశం ఉందా ? అనే అంశం ఆసక్తికరంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రధానమైన పోటీ అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్యే నెలకొంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ మాత్రం రోజురోజుకు బలహీనపడుతోంది. మరోవైపు తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ (TRS) సైతం రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే అని దాదాపుగా ఫిక్స్ అయ్యింది. ఇక మిగతా చిన్న చిన్న పార్టీలు తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఇక తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల(YS Sharmila).. ఇక్కడ ఏ మేరకు తన ప్రభావం చూపుతుందన్నది సస్పెన్స్‌గానే ఉంది. ఇటీవల ఆమెను తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయడం.. ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. అనేక మంది షర్మిలకు తమ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారనే వార్తల తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారిపోయింది. ప్రధాని మోదీ షర్మిలకు ఫోన్ చేసి కేవలం పరామర్శకు మాత్రమే పరిమితమయ్యారనే వాదనలు ఓ వైపు వినిపిస్తుంటే.. ఈ పరిణామం భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు కారణమవుతుందనే అంచనాలు మొదలయ్యాయి. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్న బీజేపీ .. రాబోయే రోజుల్లో ఇక్కడ మరింత బలపడాలని భావిస్తోంది.

అయితే తెలంగాణలో అసలు ఏ మాత్రం రాజకీయంగా ఉనికి లేని షర్మిలకు ప్రధాని ఫోన్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటనే విషయం చాలామంది అంతుచిక్కడం లేదు. అయితే ఓ మహిళ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించిందని.. అందుకే ప్రధాని మోదీ కూడా ఈ విషయంలో షర్మిలను పరామర్శించారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే షర్మిలకు ప్రధాని ఫోన్ చేయడాన్ని టీఆర్ఎస్ రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా సాగుతోంది.

Breaking News: వైఎస్ షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్..ఆ ఘటనపై ఆరా..ఢిల్లీకి రావాలని సూచన

ఫ్లాష్..ఫ్లాష్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..ఏసీబీ కోర్టులో పోలీసులకు చుక్కెదురు

షర్మిల బీజేపీ వదిలిన బాణం అని విమర్శిస్తున్న టీఆర్ఎస్.. ప్రధాని ఆమెకు ఫోన్ చేయడం వెనుక కారణం కూడా ఇదేనని విమర్శలు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి తెలంగాణలో రాజకీయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్న షర్మిలకు.. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చే అవకాశం ఉందా ? అనే అంశం ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: Telangana, YS Sharmila

ఉత్తమ కథలు