హోమ్ /వార్తలు /తెలంగాణ /

Priyanka Gandhi: తెలంగాణ ముఖ్యనేత ప్రియాంక గాంధీ మాట వింటారా ?.. అందుకు ఒప్పుకుంటారా ?

Priyanka Gandhi: తెలంగాణ ముఖ్యనేత ప్రియాంక గాంధీ మాట వింటారా ?.. అందుకు ఒప్పుకుంటారా ?

ప్రియాంక గాంధీ (ఫైల్ ఫోటో)

ప్రియాంక గాంధీ (ఫైల్ ఫోటో)

Congress High Command: మునుగోడులో పోటీ చేయబోయే అభ్యర్థి ఎంపికపై కసరత్తుతో పాటు స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ తీసుకుని ఇక్కడ కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం చేపట్టేలా చేయడంపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి పెట్టిందనే ప్రచారం సాగుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య సఖ్యత అన్నది కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా సీనియర్ నేతలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పెద్దగా పోసగడం లేదనే చర్చ జరుగుతోంది. ఇక రేవంత్ రెడ్డి తీరుపై బాహాటంగానే ఆగ్రహంగా ఉన్న మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy).. ఆయనతో కలిసి పని చేసేది లేదని ప్రకటించారు. వెంకట్ రెడ్డి డిమాండ్ చేసిన విధంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) క్షమాపణలు చెప్పినా.. వీరి మధ్య ఉన్న గ్యాప్ మాత్రం అలాగే కొనసాగుతోంది. ఓ వైపు మునుగోడు(Munugodu) ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీలు దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ మాత్రం ఇంటిపోరుతోనే సతమతమవుతోంది. రాష్ట్రస్థాయిలో ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో.. కాంగ్రెస్ హైకమాండ్ ఈ సమస్యపై దృష్టి పెట్టింది. రేవంత్ రెడ్డి సహా తెలంగాణ ముఖ్యనేతలను ఈ భేటీకి రావాల్సిందిగా ఆదేశించింది.

  సోనియాగాంధీ నివాసమైన టెన్ జన్‌పథ్‌లో జరిగే ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే అనేక మంది నేతలు ఢిల్లీ చేరుకున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కూడా ఈ భేటీకి రావాలని పార్టీ ముఖ్యనేత కేసీ వేణుగోపాల్ సమాచారం పంపినట్టు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నిక మీదే చర్చ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

  అయితే ఈ భేటీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరవుతారా ? హాజరైతే రేవంత్ రెడ్డి విషయంలో ఆయన ఏ రకమైన అభ్యంతరాలను లేవనెత్తుతారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తారనే చర్చ జరుగుతున్న ప్రియాంక గాంధీ ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారని తెలుస్తుండటంతో.. ఆమె తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యతను కుదుర్చడంతో సక్సెస్ అవుతారా ? లేదా అనే చర్చ జరుగుతోంది.

  Kalvakuntla kavitha : లిక్కర్ స్కాంతో నాకు సంబంధం లేదు .. ప్రతిపక్షాలపై బీజేపీ బురదచల్లడం మానుకోవాలి : కల్వకుంట్ల కవిత


  Family suicide : వ్యాపారి ఫ్యామిలీ చావుకి ఆ నలుగురే కారణం .. సూసైడ్‌ లెటర్‌లో ఏముందంటే..?


  ఈ సమావేశంలో మునుగోడులో పోటీ చేయబోయే అభ్యర్థి ఎంపికపై కసరత్తుతో పాటు స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ తీసుకుని ఇక్కడ కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం చేపట్టేలా చేయడంపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి పెట్టిందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నిక అంశంపై కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఈ ఉప ఎన్నిక పర్యవేక్షణను పూర్తిగా రాష్ట్ర నాయకత్వానికి వదిలేయకుండా.. ఎప్పటికప్పుడు ఈ ఎన్నిక సరళిపై నివేదికలు తెప్పించుకుని పరిశీలించాలని.. అందుకు తగ్గట్టుగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Munugodu By Election, Telangana

  ఉత్తమ కథలు