హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: కాంగ్రెస్ హైకమాండ్‌తో ఎంపీ కోమటిరెడ్డి కీలక భేటీ.. అసంతృప్తికి ఫుల్‌స్టాప్ పడుతుందా ?

Telangana: కాంగ్రెస్ హైకమాండ్‌తో ఎంపీ కోమటిరెడ్డి కీలక భేటీ.. అసంతృప్తికి ఫుల్‌స్టాప్ పడుతుందా ?

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్​)

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్​)

Komatireddy Venkat Reddy: ఓ వైపు కాంగ్రెస్ ముందుకు సాగుతుంటే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ పోరాటం చేసుకుంటుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌లో కొనసాగుతూనే సొంత పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని (Komatireddy Venkat Reddy) డీల్ చేయడం ఆ పార్టీకి కష్టసాధ్యంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్‌తో జరిగిన నేతల సమావేశానికి డుమ్మా కొట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తాజాగా మరోసారి ఢిల్లీ చేరుకున్నారు. ప్రియాంక గాంధీతో(Priyanka Gandhi) ఆయన సమావేశం కానుండటంతో.. ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు, తనకు జరుగుతున్న అవమానాలను ఆయన ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన కేసీ వేణుగోపాల్‌కు(KC Venugopal) వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది.


  ఇదిలా ఉంటే కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయన ముందు పలు ప్రతిపాదనలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిని త్వరగా ఎంపిక చేయాలని నేతలకు సూచించిన కాంగ్రెస్ హైకమాండ్.. ఇక్కడ పోటీ చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అందుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంగీకరించకపోతే.. అక్కడ గెలుపు బాధ్యతలను తీసుకోవాలని ఆయనను పార్టీ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ భేటీలోనూ కాంగ్రెస్ హైకమాండ్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పలు విజ్ఞప్తులు చేయనున్నట్టు తెలుస్తోంది.  తాను మునుగోడు ఉప ఎన్నికకు పూర్తిగా దూరంగానే ఉంటానని చాలారోజుల క్రితమే ప్రకటించిన ఎంపీ కోమటిరెడ్డి.. ఈ విషయాన్ని అధిష్టానానికి చెప్పి వారి నుంచి అనుమతి తీసుకోబోతున్నారని సమాచారం. అయితే ప్రియాంక గాంధీ, వేణుగోపాల్ వంటి వారితో సమావేశం తరువాత అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూల్ అవుతారా ? లేక తన అసహనాన్ని ఇదే రకంగా ప్రదర్శిస్తారా ? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారానికి ఏదో రకంగా శుభం కార్డు వేయకపోతే.. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగడం కష్టమనే వాదనలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.


  Eatala Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం..


  Hyderabad Old City: పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. గోషామహల్‌ చుట్టూ భారీ సెక్యూరిటీ


  ఓ వైపు కాంగ్రెస్ ముందుకు సాగుతుంటే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం ద్వారా పార్టీ అంతర్గత సమస్యలు మరింత పెరగడమే తప్ప.. పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండదనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ హైకమాండ్‌తో భేటీ కాబోతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈ భేటీ తరువాత ఏ రకమైన పొలిటికల్ టర్న్ తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Komatireddy venkat reddy, Telangana

  ఉత్తమ కథలు