తెలంగాణ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి (Marri Shashidar Reddy) రాజీనామా చేశారు. ఆయన పార్టీని వీడతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుండటంతో.. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అయితే రాజీనామా చేసే క్రమంలో ఆయన చేసిన కామెంట్స్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (Revanth Reddy) మరోసారి ఇబ్బంది కలిగించే పరిణామాలు సృష్టించేలా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితి వస్తుందని తాను ఏనాడూ ఊహించలేదని శశిధర్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ హోంగార్డుగా ఉండటం లేదని తెలిపారు.
టీ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్తో కుమ్మక్కు అయ్యారనే విషయం ప్రజల్లోకి బాగా వెళ్లిందని... ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పీసీసీ అయ్యాక అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని... పార్టీ ఇంచార్జ్‌లు నేతలను సమన్వయం చేయలేదని వ్యాఖ్యానించారు. టీపీసీసీ పదవి కోసం రేవంత్ రెడ్డి రూ.25 కోట్లు ఇచ్చారని ఓ ఎంపీ ఆరోపించారని... పార్టీలో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ల మాట చెల్లుబాటు అవుతుందని అన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని.. పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కూడా దీనికి బాధ్యత వహించాలని అన్నారు.
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారినట్టుగా ఆయన చెప్పారు. పార్టీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి గురించి ఠాగూర్ మాట్లాడనిచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించని విషయాన్ని శశిదర్ రెడ్డి వివరించారు. . కోకాపేట భూములపై సీబీఐ విచారణ జరపాలని రేవంత్ లేఖ రాశారని, ఆ తర్వాత ఆయనకు ఒకటి, రెండో విడత అందడంతో సైలెంట్ అయ్యారని మర్రి విమర్శించారు. రేవంత్ ఒక చీటర్ అని తీవ్ర విమర్శలు చేశారు.
Telangana Congress: ఎంపీ కోమటిరెడ్డికి ఊతమిచ్చేలా శశిధర్ రెడ్డి కామెంట్స్.. మళ్లీ మొదలుపెడతారా ?
Big News: ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్..ఏం చెప్పబోతున్నారు?
అయితే శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిని ఎక్కువగా టార్గెట్ చేసే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బూస్టింగ్ ఇచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక తరువాత సైలెంట్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మళ్లీ ఎప్పుడు నోరు విప్పుతారో అని కాంగ్రెస్‌లోని ఓ వర్గం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో శశిధర్ రెడ్డి పార్టీని వీడటం.. ఈ క్రమంలో ఆయన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన అంశాలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తావించి రేవంత్ రెడ్డిని, ఆయన వర్గాన్ని మరింతగా ఇరుకునపెట్టే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.