హోమ్ /వార్తలు /తెలంగాణ /

Khammam Politics: కేసీఆర్ నిర్ణయం.. ఆ మాజీ ఎంపీ వేరే దారి చూసుకుంటున్నారా ?

Khammam Politics: కేసీఆర్ నిర్ణయం.. ఆ మాజీ ఎంపీ వేరే దారి చూసుకుంటున్నారా ?

టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఫైల్ ఫోటో)

టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఫైల్ ఫోటో)

Ponguleti Srinivas Reddy: కొత్తగూడెం సీటును పొత్తులో భాగంగా సీపీఐకు వదులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రాజకీయాల్లో అవకాశాలు దక్కడం అంత తేలికేమీ కాదు. కొందరికి అవకాశాలు చాలా సులభంగా దొరికితే.. మరికొందరు మాత్రం వాటి కోసం చాలాకాలం ఎదురుచూడాల్సి వస్తుంది. ఖమ్మం (Khammam) మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిది దాదాపు ఇలాంటి పరిస్థితే అని చెప్పొచ్చు. ఒకప్పుడు వైసీపీ తరపున ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy).. ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరారు. అయితే 2018లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌ (TRS) ఓటమి కారణంగా పార్టీ నాయకత్వం ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కారణంగానే ఆయనకు 2019లో ఖమ్మం లోక్‌సభ సీటు దక్కలేదు. అయినా పార్టీ నిలిపిన నామా నాగేశ్వరరావు(Nama Nageshwara Rao) గెలుపు కోసం ఆయన పని చేశారు. ఆ తరువాత తనకు టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశం వస్తుందని లెక్కలు వేసుకున్నారు. కానీ అలా జరగలేదు.

  అయితే వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనుచరగణం ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొత్తగూడెం సీటు ఇచ్చే విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం నుంచి హామీ కూడా వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో టీఆర్ఎస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో పొంగులేటి ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయని తెలుస్తోంది.

  కొత్తగూడెం సీటును పొత్తులో భాగంగా సీపీఐకు వదులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో ఈసారి పొత్తులో భాగంగా ఆయన సీపీఐ తరపున ఇక్కడి నుంచి పోటీ చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో మాట్లాడిన పొంగులేటి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు.

  YS Sharmila : ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడం ముమ్మాటికీ తప్పే : వైఎస్‌ షర్మిల

  TS Congress: షబ్బీర్ అలీపై కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు.. ప్రియాంకాగాంధీకి లేఖ

  ప్రస్తుతం తాను టీఆర్ఎస్‌లో ఉన్నాను కాబట్టి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తానని అన్నారు. అయితే టీఆర్ఎస్ తరపున అవకాశం వచ్చినా.. రాకపోయినా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం గ్యారంటీ అనే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్ చేయడంతో ఆయన కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారా ? లేక ఖమ్మం ఎంపీగానే మళ్లీ బరిలోకి దిగుతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి వామపక్షాలతో పొత్తు పెట్టుకోవాలనుకున్న కేసీఆర్ నిర్ణయం.. పొంగులేటిపై బాగానే ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Ponguleti srinivas reddy, Telangana

  ఉత్తమ కథలు