హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| BJP: కేసీఆర్ జాతీయ పార్టీపై కొనసాగుతున్న సస్పెన్స్.. ఆ మీటింగ్ తరువాతే నిర్ణయం ?

KCR| BJP: కేసీఆర్ జాతీయ పార్టీపై కొనసాగుతున్న సస్పెన్స్.. ఆ మీటింగ్ తరువాతే నిర్ణయం ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR-Modi: బీజేపీ సమావేశాల కోసం రెండు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండనున్న ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా.. ఇక్కడ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని.. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్(TRS) పార్టీని బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మార్చబోతున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై కేసీఆర్(KCR) ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని.. పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి దీనిపై ఆయన నిర్ణయం ప్రకటించబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే కారణం ఏంటో తెలియదు కానీ.. కేసీఆర్ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరికొద్దిరోజుల్లోనే ఆషాఢ మాసం రానుండటంతో.. ఆయన జాతీయ పార్టీ ప్రకటన మరో నెల రోజుల పాటు వాయిదా పడే ఛాన్స్ ఉందనే చర్చ తెలంగాణ(Telangana) రాజకీయవర్గాల్లో సాగుతోంది. మరోవైపు కేసీఆర్ ఈ విషయంలో అసలు ఏం ఆలోచిస్తున్నారన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.

ఆ మధ్య కొద్దిరోజులు జాతీయ పార్టీ విషయంలో పలువురు నేతలతో వరుస భేటీలు నిర్వహించిన కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ ఆ చర్చలకు బ్రేక్ వేశారనే టాక్ వినిపిస్తోంది. దీంతో అసలు ఈ విషయంలో కేసీఆర్ పునరాలోచనలో పడ్డారా ? లేక మరికొంతకాలం వేచి చూడాలనే ఆలోచనతో ఉన్నారా ? అనే టాక్ కూడా మొదలైంది. అయితే త్వరలోనే తెలంగాణలో బీజేపీ(BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. ఆ భేటీకి కేసీఆర్ జాతీయ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా ? అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో(Hyderabad) జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న బీజేపీ.. జాతీయస్థాయి అంశాల కంటే ఎక్కువగా తెలంగాణపైనే ఫోకస్ చేస్తోంది.

రెండు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండనున్న ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా.. ఇక్కడ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం రోడ్ మ్యాప్‌ను బీజేపీ రెడీ చేస్తోంది. ఈ సారి టార్గెట్ తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదనే ఆలోచనతో బీజేపీ ఉంది. అందుకే జాతీయ కార్యవర్గ సమావేశాలు, అనంతరం పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే బహిరంగ సభలో ప్రధాని మోదీ టీఆర్ఎస్‌ లక్ష్యంగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

KCR: కేసీఆర్ మంచి అవకాశాన్ని వదులుకున్నారా ?.. కీలక సమయంలో ఇలా..

YS Sharmila: స్కూళ్లలో మంచినీళ్లు దొరకడం లేదు కానీ, తెలంగాణలో మద్యం దొరుకుతోంది.. సీఎం కేసీఆర్​పై షర్మిలా ఫైర్​

ప్రధాని తమను ఏ విధంగా టార్గెట్ చేస్తారన్న విషయంపై క్లారిటీ వచ్చిన తరువాతే కేసీఆర్ కూడా తన జాతీయ పార్టీ విషయంలో ఓ స్పష్టతకు వస్తారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా బీజేపీ మీటింగ్ మీదే ఆధారపడి తన జాతీయ పార్టీని ఏర్పాటు చేయకపోయినా.. జాతీయ స్థాయిలో ఎలాంటి అంశాలపై ఫోకస్ చేయాలనే దానిపై బీజేపీ సమావేశాల తరువాత కేసీఆర్ ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Bjp, CM KCR, PM Narendra Modi, Telangana, Trs

ఉత్తమ కథలు