హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR: ఆ ఇద్దరికీ కేసీఆర్ కౌంటర్ ఇచ్చేది ఎప్పుడు ? డేట్, టైమ్ ఫిక్స్ అయ్యిందా ? కొత్త అంశాలతో..

KCR: ఆ ఇద్దరికీ కేసీఆర్ కౌంటర్ ఇచ్చేది ఎప్పుడు ? డేట్, టైమ్ ఫిక్స్ అయ్యిందా ? కొత్త అంశాలతో..

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana| KCR: ఎక్కువకాలం మౌనంగా ఉన్న తరువాత కేసీఆర్ సరికొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తుంటారు.

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సై అంటున్నాయి. కేసీఆర్ ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్న విపక్షాలు.. అందుకు సిద్ధంగా ఉండాలని భావిస్తున్నాయి. లేకుంటే గతంలో మాదిరిగా దెబ్బతినాల్సి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ తెలంగాణకు(Telangana) వచ్చి కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంపై ఫోకస్ చేశారు. ఎన్నికల కోసం ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపై సూచనలు చేయడంతో పాటు పార్టీ నేతలకు డైరెక్ట్‌గానే వార్నింగ్‌ కూడా ఇచ్చి వెళ్లారు.

ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు వచ్చిన అమిత్ షా.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము రెడీ అని ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీ.. ఈసారి కచ్చితంగా అధికారంలోకి రావాల్సిందే అని పార్టీ నేతలకు తేల్చిచెప్పారు. ఆ దిశగా కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. పదిరోజుల వ్యవధిలో రాహుల్ గాంధీ, అమిత్ షా తెలంగాణకు వచ్చి వెళ్లడంతో.. ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మీదే నెలకొంది.

రాహుల్ గాంధీ పర్యటన నుంచి అమిత్ షా టూర్ వరకు కేసీఆర్ సైలెంట్‌గా ఉంటున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత వంటి వాళ్లు రాహుల్ గాంధీ, అమిత్ షా (Amit Shah) వంటి నేతల వ్యాఖ్యలకు కౌంటర్లు, సవాళ్లు విసురుతున్నా.. కేసీఆర్ మాత్రం వీరి విమర్శలకు సమాధానం చెప్పకుండా వ్యూహత్మక మౌనం పాటిస్తున్నారు. దీంతో ఈ నేతలందరికీ కేసీఆర్ ఎప్పుడు కౌంటర్ ఇస్తారనే అంశంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓ బహిరంగ సభ ద్వారానే సీఎం కేసీఆర్ రాహుల్ గాంధీ, అమిత్ షా విమర్శలకు కౌంటర్ ఇస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చెన్నూరులో ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో భారీ బహిరంగ సభ ఉంటుందని.. అక్కడే కేసీఆర్ ఈ ఇద్దరు నేతలు, రెండు పార్టీలకు కౌంటర్ ఇస్తారని సమాచారం.

Amit Shah| Tukkuguda : కేసీఆర్‌ను పీకిపారేయడానికి బండి సంజయ్ చాలు: తుక్కుగూడ సభలో అమిత్ షా

BJP | Tukkuguda : ప్లీజ్.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి: తుక్కుగూడ సభలో బండి సంజయ్ సంచలన ప్రసంగం.. కీలక హామీలు..

అయితే సాధారణంగా అందరూ ఊహించని దానికంటే భిన్నంగా ఆలోచించే సీఎం కేసీఆర్.. ఈ రెండు పార్టీలకు చెక్ చెప్పేందుకు ఏదైనా కొత్త వ్యూహంతో ముందుకు రాబోతున్నారా ? అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎక్కువకాలం మౌనంగా ఉన్న తరువాత కేసీఆర్ సరికొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తుంటారు. ఈసారి కూడా ఆయన ఇదే రకంగా చేయబోతున్నారా ? అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి రాహుల్ గాంధీ, అమిత్ షా విమర్శలకు కేసీఆర్ ఎప్పుడు, ఎక్కడ కౌంటర్ ఇస్తారన్నది సస్పెన్స్‌గానే మారింది.

First published:

Tags: CM KCR, Telangana