హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR-KumaraSwamy: కేసీఆర్‌కు దూరంగా కుమారస్వామి.. అప్పటివరకు పరిస్థితి ఇంతేనా ?

KCR-KumaraSwamy: కేసీఆర్‌కు దూరంగా కుమారస్వామి.. అప్పటివరకు పరిస్థితి ఇంతేనా ?

కుమార స్వామితో సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

కుమార స్వామితో సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

KCR-Kumaraswamy: బీఆర్ఎస్ ఆవిర్భావానికి టీఆర్ఎస్ తీర్మానం చేసే సమయం నుంచి కేసీఆర్ వెంట ఉన్న నాయకుల్లో కుమారస్వామి పేరును ప్రముఖంగా చెప్పుకోవాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బీఆర్ఎస్ ద్వారా దేశ రాజకీయాల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్(KCR).. పలు రాష్ట్రాల్లో అందుకోసం రాజకీయ మిత్రులను కూడా వెతుక్కున్నారు. ఇందులో భాగంగా కర్ణాటకలో జేడీఎస్‌కు తమ మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్(BRS) సభకు జేడీఎస్ నాయకుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి(Kumaraswamy) దూరంగా ఉన్నారు. అక్కడ పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్లే ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు బీఆర్ఎస్ సభలు, కార్యకలాపాలకు దూరంగా ఉండాలనే ఆలోచనతో కుమారస్వామి, జేడీఎస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి బీఆర్ఎస్ ఆవిర్భావానికి తీర్మానం చేసే సమయం నుంచి కేసీఆర్ వెంట ఉన్న నాయకుల్లో కుమారస్వామి పేరును ప్రముఖంగా చెప్పుకోవాలి.

అలాంటి కుమారస్వామి ఖమ్మం సభకు రాకపోవడం.. కేసీఆర్‌పై అనుమానంతోనే ఆయన ఈ సమావేశానికి రాలేదన్నట్టుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. అయితే ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని భావిస్తున్న కేసీఆర్‌ ఆశలకు కర్ణాటకకు చెందిన కుమారస్వామి నుంచి సానుకూల స్పందన రాలేదనే ఊహాగానాలు మొదలయ్యాయి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంట్రీ ఇస్తే.. అది తమకు ఇబ్బందిగా మారుతుందని జేడీఎస్ భావిస్తోందని సమాచారం. అందుకే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు బీఆర్ఎస్ కార్యకలాపాలకు జేడీఎస్ దూరంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ అంశంపై జేడీఎస్ నాయకత్వం ఇప్పటికే కేసీఆర్‌కు క్లారిటీ ఇచ్చినట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం చేయాలని అనుకున్న కేసీఆర్ ప్లాన్‌ కూడా వర్కవుట్ అయ్యే పరిస్థితులు లేవనే చర్చ జరుగుతోంది.

తెలంగాణ పథకాలు భేష్.. తమిళనాడు ఎమ్మెల్యేల కితాబు

Hyderabad: తెలంగాణ డీజీపీ ఏపీకి వెళ్లిపోవాల్సిందే.. ఎమ్మెల్యే రఘునందన్ సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ పరిస్థితులు ఏర్పడితే.. జేడీఎస్ కింగ్ మేకర్ పాత్రను పోషిస్తుంటుంది. అందుకు తగ్గ సీట్లను సాధించడంపైనే ఆ పార్టీ ఎక్కువగా దృష్టి పెడుతుంటుంది. ఇప్పుడు కూడా జేడీఎస్ అదే రకమైన వ్యూహంతో ఉందని.. కాంగ్రెస్ , బీజేపీలకు ఎదుర్కొని తమకు బలమున్న సీట్లను గెలుచుకోవడంపై జేడీఎస్ నాయకత్వం సీరియస్‌గా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే బీఆర్ఎస్ సభకు దూరంగా జేడీఎస్ దూరంగా ఉందని... రాబోయే కొద్ది నెలలపాటు జేడీఎస్ బీఆర్ఎస్ సమావేశాలకు దూరంగానే ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

First published:

Tags: CM KCR, Kumaraswamy, Telangana

ఉత్తమ కథలు