హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Congress: కాంగ్రెస్‌లో డీఎస్ చేరిక వాయిదా పడటానికి కారణం ఇదేనా ?

Telangana Congress: కాంగ్రెస్‌లో డీఎస్ చేరిక వాయిదా పడటానికి కారణం ఇదేనా ?

డి.శ్రీనివాస్ (ఫైల్ ఫోటో)

డి.శ్రీనివాస్ (ఫైల్ ఫోటో)

D Srinivas: కాంగ్రెస్ పార్టీలో డీఎస్ చేరిక వాయిదా పడటం వెనుక ఈ అభ్యంతరాలే కారణమా ? లేక వచ్చే ఏడాది మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్‌లో చేరాలని ఆయన భావిస్తున్నారా ? అన్నది తెలియాల్సి ఉంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కొంతకాలం నుంచి రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆ పార్టీకి ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత బీజేపీ మరింత దూకుడు ప్రదర్శిస్తుండటంతో.. ఆ పార్టీని ధాటిని తట్టుకుని రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడింది. అలాంటి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు.. ఆ పార్టీ మాజీ సీనియర్ నేత డి.శ్రీనివాస్ సిద్ధపడ్డారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చలు కూడా జరిపారు. త్వరలోనే టీఆర్ఎస్ ద్వారా తనకు వచ్చిన రాజ్యసభ సీటు పదవీకాలం కూడా పూర్తికానుండటంతో.. మళ్లీ తన సొంతగూటికి చేరుకుని ఆ పార్టీకే సేవలు అందించాలని డీఎస్ భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. నిజానికి ఈ రోజే డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది.

కానీ కారణం తెలియదు కానీ.. ఈ చేరిక వాయిదా పడింది. జనవరిలో సంక్రాంతి పూర్తయిన తరువాత డీఎస్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే వార్తలు మొదలయ్యాయి. అయితే డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడం వెనుక మరో కారణం కూడా ఉందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం డీఎస్ చిన్న కొడుకు అరవింద్ నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఇలా తండ్రి ఒక పార్టీలో, కుమారుడు మరో పార్టీలో ఉండటం వల్ల ప్రయోజనం ఉండదని కొందరు నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి సూచించినట్టు సమాచారం.

అంతేకాదు.. టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డి.శ్రీనివాస్.. బీజేపీ తరపున పోటీ చేసిన తన కుమారుడు అరవింద్ గెలుపు కోసం పని చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే టీఆర్ఎస్ నాయకత్వం డీఎస్‌ను పక్కన పెట్టింది. అప్పటి నుంచి ఏ పార్టీకి సంబంధం లేని రాజ్యసభ సభ్యుడి తరహాలో ఆయన కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినా.. తన కుమారుడు అరవింద్ బీజేపీలో కొనసాగే అవకాశాలే ఎఖ్కువగా ఉన్నాయని.. అలాంటప్పుడు ఆయన కాంగ్రెస్ కోసం మనస్పూర్తిగా ఎలా పని చేస్తారని కొందరు నిజామాబాద్ నేతలు ప్రశ్నించినట్టు సమాచారం.

బీజేపీ వ్యూహానికి ఆదిలోనే చెక్ పెడుతున్న CM KCR.. ఆ ప్లాన్‌లో భాగమేనా ?

రైతుబంధుపై స్పష్టత ఇచ్చిన సీఎం కేసీఆర్.. దళితబంధుపై ఆసక్తికర వ్యాఖ్యలు

అయితే కాంగ్రెస్ పార్టీలో డీఎస్ చేరిక వాయిదా పడటం వెనుక ఈ అభ్యంతరాలే కారణమా ? లేక వచ్చే ఏడాది మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్‌లో చేరాలని ఆయన భావిస్తున్నారా ? అన్నది తెలియాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి నమ్మినబంటుగా ఉన్న డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరితే.. ఆయన పార్టీలో కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.

First published:

Tags: D Srinivas, Telangana

ఉత్తమ కథలు